గుంటూరు: ప్రముఖ రాజకీయ నేత, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాయపాటి సాంబశివరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.