Headlines

సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉన్నా లోన్ రావడం లేదా..? ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు..


సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉన్నా లోన్ రావడం లేదా..? ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు..

మీరు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ లేదా మైక్రో ఫైనాన్స్, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందాలంటే సిబిల్ స్కోర్ అనేది తప్పనిసరి. సిబిల్ స్కోర్ లేకపోతే ఏ బ్యాంక్ మీకు రుణాలు, క్రెడిట్ కార్డులు మంజూరు చేయదు. పర్సనల్ లోన్, హోమ్ లోన్.. ఇలా ఏ లోన్ తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ అనేది మెరుగ్గా ఉండాలి. మినిమం 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే మీకు రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇక క్రెడిట్ కార్డు కావాలన్నా సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. లేకపోతే మీరు రుణం, క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తు ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతుంది.

బ్యాంకులు తనిఖీ చేసే అంశాలివే..

అయితే సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వెంటనే రుణం మంజూరు అవుతుందని మీరు భావించినట్లయితే మీరు పొరపాటు పడినట్లే. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే రుణాలు వెంటనే మంజూరు అవుతాయని చాలామంది అనుకుంటారు. ఇలా భావించి రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ చివరకు బ్యాంకులు తిరస్కరిస్తే కారణం ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతుంటారు. బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి కేవలం సిబిల్ స్కోర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోవు. వివిధ అంశాలను కూడా ముఖ్యంగా పరిశీలనలోకి తీసుకుంటాయి. మీ గత రుణ చరిత్రను కూడా చెక్ చేస్తాయి. గతంలో ఈఎంఐలు సమయానికి చెల్లించారా.. లేదా అనేది తనిఖీ చేస్తాయి. అలాగే ఇప్పటికే ఉన్న అప్పులు, ఆదాయం, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి.

ఇలాంటి సమయాల్లో లోన్ మంజూరు కాదు..

మీరు గతంలో అధిక ఈఎంఐలు మిస్ చేస్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే రుణాలు చెల్లించడంలో ఆలస్యం చేసినా లేదా ఈఎంఐలను పదే పదే ఆలస్యం చేసినా, ఇప్పటికే అధిక రుణాలు కలిగి ఉన్నా మీ దరఖాస్తును తిరస్కరించవచ్చని చెబుతున్నారు. కేవలం సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉన్నంత మాత్రన రుణాలు మంజూరు చేయనవి, బ్యాంకులు అన్ని కోణాల్లో పరిశీలన చేపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రుణం  లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మీరు ఇప్పటికే అప్పులు ఎక్కువ కలిగి ఉంటే దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కొన్నిసార్లు లోన్ ఆమోదం కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *