Headlines

డీలిమిటేషన్‌పై ఢీ అండే ఢీ.. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. స్టాలిన్, పవార్‌తో కాంగ్రెస్ నేతల భేటీ!


దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. డీలిమిటేషన్‌పై ఢిల్లీలో ఢీ అండే ఢీ అంటున్నాయి అధికార, విపక్ష కూటములు.. ఈ అంశం చుట్టూ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు.. అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీలో వరుస సమావేశాలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం.. 3 గంటలకు ప్రధాని నివాసంలో ఎంపీలు, విప్‌ల సమావేశం.. 4 గంటలకు శివసేన సమావేశం జరగనున్నాయి. కేంద్రం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ.. రాజకీయ పార్టీల మధ్య సమీకరణాలు ఎలా మారుతున్నాయి..? బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో అధికార పక్షం ఉందా..? వ్యతిరేకతను ఐక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయా..? అనే దానిపై ఇవాళ్టి సమావేశాలు కీలకంగా మారాయి.

స్టాలిన్,శరద్ పవార్‌తో ఇండికూటమి నేతలు భేటీ

డీలిమిటేషన్ బిల్లును ఓడించేందుకు ఇండి కూటమి వ్యూహం రచిస్తోంది. డీలిమిటేషన్‌పై ఇండి కూటమి నేతల కీలక సమావేశాలకు ప్లాన్ చేశారు. స్టాలిన్,శరద్ పవార్‌తో ఇండికూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ మేరకు చెన్నై, ముంబైకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, మమతా బెనర్జీ, ఇండి కూటమి నేతలు వెళ్లి భేటీ కానున్నారు. మ.2 గంటలకు స్టాలిన్‌తో.. రాత్రి 8కి శరద్‌పవార్‌తో భేటీ కానున్నారు. భేటీలకు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం చెన్నైలో ఇండి కూటమి నేతల ప్రెస్‌మీట్ జరగనుంది. ఇప్పటికే డీలిమిటేషన్‌కు DMK, NSP-SP మద్దతు తెలిపాయి. మద్దతు ఉపసంహరించుకోవాలని ఇండి కూటమి నేతలు కోరనున్నారు. ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన స్టాలిన్, శరద్ పవార్‌లతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరపనుండడం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం..

డీలిమిటేషన్‌పై తన వ్యతిరేక వైఖరిని బలంగా వినిపించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. నిన్న ఇండి కూటమి నేతల సమావేశంలో కీలక ఆంశాలపై చర్చించారు నేతలు. దానికి కంటిన్యూగా పార్లమెంటు వ్యూహాలపై చర్చించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇవాళ సమావేశం అవుతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత జరిగే జాయింట్ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కర్నాటక సీఎం డీకే శివకుమార్, కేరళం సీఎం సతీశన్‌ పాల్గొంటారు. కేంద్రం ప్రతిపాదనపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగనుంది.

మోదీ నివాసంలో కీలక సమావేశం..

డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు అధికార పక్షం కూడా రంగంలోకి దిగింది. ఇవాళ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది బీజేపీ. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో జరిగే భేటీలో ఎంపీలు, విప్‌లకు డీలిమిటేషన్ బిల్లుపై వివరించనుంది అధిష్ఠానం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు చర్చకు రానుండడంతో.. ఎంపీల హాజరు, సభలో అనుసరించాల్సిన వ్యూహం, మిత్రపక్షాలతో సమన్వయం, బిల్లుకు మద్దతు కూడగట్టడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతుంది.

డీలిమిటేషన్ బిల్లుపై శివసేన కూడా కీలక సమావేశం నిర్వహించనుంది. బిల్లుకు మద్దతుగా ఇప్పటికే తీర్మానం చేసిన షిండేవర్గం శివసేన.. ఆ కాపీని ఇవాళ ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్‌కు అందజేయనుంది. సాయంత్రం 4 గంటలకు శివసేన ఎంపీలు సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *