Headlines

MS Narayana : ఆ నటుడి కామెడీ టైమింగ్ వేరేలెవల్.. స్క్రిప్ట్‌లో లేని డైలాగ్‌తో మైండ్ బ్లోయింగ్ కౌంటర్.. ఎంఎస్ నారాయణ..


తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో తమదైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దిగ్గజ హాస్యనటులు ఎం.ఎస్. నారాయణ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నటుడు కృష్ణ భగవాన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రచయితలుగా ప్రస్థానం మొదలుపెట్టి నటులుగా ఎదిగిన ఎందరో కళాకారుల గురించి గతంలో ఎం.ఎస్. నారాయణ పంచుకున్న ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి . ముఖ్యంగా కృష్ణ భగవాన్ సమయస్ఫూర్తి, కామెడీ టైమింగ్‌పై ఆయన చేసిన ప్రశంసలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రచయితలుగా వచ్చిన ఎల్.బి. శ్రీరామ్, తనికెళ్ల భరణి, కొలపూడి మారుతీరావు వంటి వారి గురించి ప్రస్తావిస్తూ, దర్శకులు ఎప్పుడూ నటనా శైలిని బట్టే నటులను ఎన్నుకుంటారని ఎం.ఎస్. నారాయణ తెలిపారు. రచయితగా ఉండటం సంభాషణలకు పదును పెట్టడానికి ఉపయోగపడుతుందని, కానీ తెరపై నటుడిగా నిలబడటానికి టైమింగ్, సమయస్ఫూర్తి కీలకమని చెప్పారు. కృష్ణ భగవాన్ నటించేటప్పుడు కూడా ఆయనలోని రచయిత కనిపిస్తాడని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

దీనికి ఉదాహరణగా కబడ్డీ కబడ్డీ సినిమా షూటింగ్‌లోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. తాను చెబుతూ నాకు చాలా మంది వచ్చి కబడ్డీ ట్రైనింగ్ ఇవ్వమని అడుగుతున్నారు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి.. అదిగో మా పిల్ల ఉంది, దానికి పెళ్లి చేయాలి. ఒక్కగానొక్క కూతురు.. తల్లి లేని పిల్ల అని తాను డైలాగ్ చెప్పగానే వెంటనే కృష్ణ భగవాన్ స్పందిస్తూ స్క్రిప్ట్‌లో లేని డైలాగ్‌ను తల్లి లేకుండా ఎలా పుట్టిందండి? అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారని నారాయణ చెప్పారు . తల్లి లేని పిల్ల అంటే తల్లి లేదని అర్థం అయినా, ఆ మాటను అప్పటికప్పుడు మరో కోణంలో తిప్పి చెప్పిన సమయస్ఫూర్తి అద్భుతమని అన్నారు. ఆ డైలాగ్ అసలు స్క్రిప్టులో లేదని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

తన చిన్నప్పటి నుంచే ఇలాంటి సమయస్ఫూర్తి, హాస్య చతురత ఉండేవని ఎం.ఎస్. నారాయణ పంచుకున్నారు.. కాలేజీలో ఓ మాస్టర్ పద్యాలు పాడుతుంటే, తను సరదాగా స్పందించినందుకు రెండు రోజులు సస్పెండ్ చేశారట. లెక్చరర్‌గా పనిచేసిన రోజుల్లోనూ విద్యార్థులతో సరదాగా మెలిగేవారని, ఓ నాటిక రాసి ప్రదర్శించినప్పుడు దానికి అవార్డులు రావడంతో స్నేహితుల ప్రోత్సాహంతో భీమవరం నుంచి సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి చెన్నైకి సినీ ప్రయాణం కోసం బయలుదేరిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *