Headlines

Gold Prices: గోల్డ్ లవర్స్‌కు పెద్ద ఊరట.. శాంతించిన పసిడి.. ఆదివారం తులం ఎంతంటే..?


బంగారం ధరలు ఇటీవల రోజురోజుకూ మారుతూ సామాన్యులను, కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధరలు కొద్దిరోజులుగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఆదివారం కాస్త శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. నవంబర్ 29వ తేదీన గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు ఇవే..

– హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200గా ట్రేడవుతోంది.

– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200 వద్ద ట్రేడవుతోంది.

– దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,010 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,350గా కొనసాగుతోంది.

– చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,860 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200గా కొనసాగుతోంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,200 వద్ద ట్రేడవుతోంది.

వెండి రేట్లు ఇవే..

– దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతోంది.

– హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1.70 లక్షలుగా ఉంది.

– చెన్నైలో కిలో వెండి ధర రూ.1.70 లక్షల వద్ద ట్రేడవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *