Headlines

బంగారం తాకట్టులో టాప్ 5 రాష్ట్రాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతంటే?


బంగారం.. ఆ పేరు వింటే చాలు ఆటోమేటిక్‌గా విలువైంది అనే సంకేతాలు మన మెదడు ఇచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే కేవలం అలంకారం మాత్రమే కాదని చెప్పాలి. ఓ ప్రముఖ కవి మాటల్లో చెప్పాలంటే.. ఆడవారి అందానికి పసిడి తోడైతే.. ఆ మెరుపు ముందు ఏ వెలుగైనా చిన్నబోతుంది. అందుకే ఆడవారికి బంగారం అంటే అంత ఇష్టమని చెప్పొచ్చు. అంతే కాకుండా కష్టకాలంలో ఆదుకునే ఒక ఆపద్బాంధవుడుగా కూడా బంగారం నిలుస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో ఎంతో కొంత పసిడిని దాచుకుంటారు.

కానీ మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. పసిడిని కొనడమే చాలా కష్టం అనేలా తయారైంది. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఆసుపత్రి ఖర్చుల వంటి అత్యవసరాలకు మాత్రమే బంగారం తాకట్టు పెట్టేవారు.. ఇప్పుడు చిన్నపాటి కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు కూడా గోల్డ్ లోన్ ఒక ఇన్‌స్టంట్ ఏటీఎంలా మారిపోయింది. ఈ రకంగా బంగారం పరిస్థితి మారడానికి కారణం అంటే ధరలు ఆకాశాన్ని తాకేలా పెరగడమే. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో.. ఉన్న పసిడిపైనే ఎక్కువ రుణం వస్తుండటంతో ప్రజలు తమ అవసరాల దృష్ట్యా గోల్డ్ లోన్ కోసం మొగ్గు చూపుతున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బంగారం తాకట్టులో టాప్ 5 రాష్ట్రాలు ఇవే..

దేశవ్యాప్తంగా తీసుకున్న మొత్తం గోల్డ్ లోన్లలో 72.1 శాతం వాటా (రూ. 16.8 లక్షల కోట్లు) దక్షిణాది రాష్ట్రాలదే కావడం విశేషం. ఆ రాష్ట్రాలు ఏవంటే ??

  • మొదటి స్థానం – తమిళనాడు 29.6 శాతం వాటాతో (రూ. 6.9 లక్షల కోట్లు)
  • రెండో స్థానం – ఆంధ్రప్రదేశ్ 15.9 శాతం వాటాతో (రూ. 3.7 లక్షల కోట్లు)
  • మూడో స్థానం – కర్ణాటక (రూ. 2.4 లక్షల కోట్లు)
  • నాలుగో స్థానం – తెలంగాణ (రూ. 2.1 లక్షల కోట్లు)
  • ఐదో స్థానం – కేరళ (రూ. 1.7 లక్షల కోట్లు)

మహిళలు, చిన్న పట్టణాలే కీలకం..

గోల్డ్ లోన్ తీసుకోవడంలో మహిళల వాటానే అత్యధికంగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మెట్రో నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోనూ (టైర్-3) పసిడి రుణాలు తీసుకునే వారి సంఖ్య 3.7 కోట్లకు చేరిందని వివరిస్తున్నారు. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షల లోపు రుణాలకు బంగారం విలువలో 85 శాతం.. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల లోపు 80 శాతం.. రూ. 5 లక్షలు దాటితే 75 శాతం వరకు లోన్ ఇస్తున్నారు. ఈ రుణాల మంజూరులో 54.8 శాతం వాటాతో ప్రభుత్వ రంగ బ్యాంకులు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *