Headlines

తల్లి చనిపోగానే చెల్లిని రోడ్డుపాలు చేసిన అన్న!


విజయవాడ: తల్లి మరణించిన వెంటనే కన్నతండ్రిలా చూసుకుంటాడని నమ్మిన అన్న కన్నెర్ర చేశాడు. దశాబ్దాలుగా ప్రాణం కన్నా మిన్నగా పెంచి పెద్ద చేసిన చెల్లిని తల్లి చనిపోయిన మరుక్షణమే అన్న రోడ్డున పడేశాడు. ఈ అమానుష ఘటన విజయవాడలోని మాచవరంలో చోటుచేసుకుంది. 45 ఏళ్లుగా పెరిగిన సొంతింట్లోంచి కృష్ణకుమారిని అన్న బయటకు పంపాడు. తల్లి మరణంతో ఆలంబన కోల్పోయిన కృష్ణకుమారి ఇప్పుడు అనాథగా మారి ఆవేదన చెందుతోంది. కృష్ణకుమారి తన ఆవేదనను వెల్లడిస్తూ, తాను అన్నయ్యను ఎంతో గౌరవించానని, కానీ అతను తనను ఇంట్లోంచి తాళం వేసి బయటకు గెంటేశాడని తెలిపారు. అన్న కుమారుడు నవీన్ కూడా తనపై దాడి చేసి, “నీకు దిక్కున్న చోట చెప్పుకో, లక్ష రూపాయలు మేం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, నీ చేతనైనది చేసుకో” అంటూ బెదిరించాడని ఆమె వాపోయింది. ఈ బాధను తట్టుకోలేక స్పందనలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని కృష్ణకుమారి కన్నీరుమున్నీరయ్యారు. తల్లి ప్రేమలో పెరిగిన బంధం ఆమె కన్నుమూయగానే కనుమరుగైందని, చెట్టు కింద దీనంగా రోదిస్తున్న తనకు అధికారులు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో చేపల మార్కెట్లపై ఫుడ్‌ సేఫ్టీ దాడులు!

అందం కోసం ఫేస్ క్రీమ్‌లు వాడుతున్నారా ? అయితే ఆసుపత్రిలో చేరాల్సిందే

టూరిస్ట్ కేంద్రాల్లో పండగ సందడి.. వచ్చే ఏడాది నుంచి ఫెస్టివల్స్‌కు ప్రభుత్వం ప్లాన్

పర్ఫెక్ట్ ఓనర్…ఇళ్ల అద్దెతో నెలకు రూ. 75 లక్షలు సంపాదన!

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐ, ఏటీఎం ద్వారా సులభంగా విత్‌డ్రా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *