Headlines

రూ.1,000 లోపు బెస్ట్ 5 ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవే..!


ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఇంటి వంటగదిలోనూ ఎలక్ట్రిక్ కెటిల్ (Electric Kettle) ఒక ముఖ్యమైన భాగమైపోయింది. గ్యాస్ స్టవ్‌తో పనిలేకుండా కేవలం నిమిషాల్లోనే నీటిని వేడి చేసుకోవడానికి, టీ, కాఫీ లేదా సూప్‌లు తయారు చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నీరు పూర్తిగా మరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే (Auto Shut-off) ఫీచర్ సైతం ఇందులో ఉండటం వల్ల కరెంటు ఆదా అవ్వడమే కాకుండా పూర్తి భద్రత కూడా ఉంటుంది. తక్కువ సమయంలో, సులభంగా వేడి నీరు కావాలనుకునే వారికి ఎలక్ట్రిక్ కెటిల్స్ బెస్ట్ ఆప్షన్.

మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ కెటిల్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. మార్కెట్లో రూ.1,000 లోపు లేదా ఆ ధరకు దగ్గరగా లభించే పలు బడ్జెట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్ షట్-ఆఫ్, స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా కొన్ని మోడళ్లలో ఉన్నాయి. మరి ఇంట్లో, ఆఫీస్‌లో ఉపయోగించుకోవడానికి, తక్కువ స్థలంలో సర్దుకునేందుకు అనువైన టాప్ 5 ఎలక్ట్రిక్ కెటిల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

రూ.1,000 లోపు టాప్ 5 ఎలక్ట్రిక్ కెటిల్స్..

1. Milton Go Electro 1.2L.. 

ఇందులో 1.2 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. 1350 వాట్ల పవర్ హీటింగ్ ఎలిమెంట్ ఉండటంతో నీటిని వేగంగా వేడి చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో లాకబుల్ లిడ్, డ్రై బాయిల్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే టీ పొడి కప్పులోకి రాకుండా అడ్డుకునే మెష్ ఫిల్టర్ కూడా ప్రత్యేక ఆకర్షణ.  దీని ధర సుమారు రూ.749.

2. Havells Hotsip 1L..

నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి Havells Hotsip మరో మంచి ఎంపిక. ఇందులో 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. లోపలి భాగంలో SS304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించారు. ఈ కెటిల్ 1250 వాట్ల పవర్‌తో పనిచేస్తుంది. దీని హ్యాండిల్ కూల్ టచ్ డిజైన్‌తో ఉండటం వల్ల పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. దీని ధర ఆన్‌లైన్ ఆఫర్లను బట్టి సుమారు రూ.999 నుంచి రూ.1,099 వరకు ఉంటుంది.

3. Pigeon Favourite 1.2L..

టీ, కాఫీలతో పాటు అప్పుడప్పుడు ఇన్‌స్టంట్ నూడుల్స్, ఓట్స్, సూప్ వంటి వాటి కోసం కూడా వేడి నీరు అవసరమయ్యేవారికి Pigeon Favourite ఉపయోగపడుతుంది. ఇందులో 1.2 లీటర్ల కెపాసిటీతో కూడిన స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ ఉంటుంది.  ఓవర్‌హీట్ సెన్సార్, ఆటో కట్-ఆఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ.799 నుంచి రూ.899 మధ్య ఉంటుంది.

4. Prestige PKOSS 0.6L..

ఎక్కువ కెపాసిటీ అవసరం లేకుండా కేవలం ఒక్కరి కోసం టీ లేదా కాఫీ తయారు చేసుకోవాలనుకునేవారికి Prestige PKOSS మంచి ఎంపిక. ఇందులో 0.6 లీటర్లు అంటే 600ml సామర్థ్యం ఉంటుంది. చిన్న సైజులో ఉండటం వల్ల ఆఫీస్ డెస్క్‌పై ఎక్కువ స్థలం ఆక్రమించదు. ప్రయాణాలు చేసే ఉద్యోగులు కూడా తమ వెంట తీసుకెళ్లేందుకు పరిశీలించవచ్చు. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, స్పిల్ ప్రూఫ్ లిడ్, ఆటో షట్-ఆఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ.899.

5. Butterfly Rapid 1.5L.. 

ఇందులో 1.5 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. 1500 వాట్ల హీటింగ్ పవర్ ఉండటంతో ఎక్కువ పరిమాణంలో నీటిని వేగంగా వేడి చేసుకోవచ్చు. ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది.  దీని ధర ఆన్‌లైన్ సేల్స్‌లో సుమారు రూ.849 నుంచి రూ.949 మధ్య ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • ఎలక్ట్రిక్ కెటిల్‌లో సూచించిన గరిష్ఠ స్థాయికి మించి నీటిని నింపకూడదు.
  • నీరు లేకుండా కెటిల్‌ను ఆన్ చేయకూడదు.
  • తడి చేతులతో ప్లగ్ లేదా స్విచ్‌ను తాకకూడదు.
  • ల్యాప్‌టాప్, ముఖ్యమైన డాక్యుమెంట్లకు దూరంగా కెటిల్‌ను ఉంచాలి.
  • నీరు మరిగిన తర్వాత ప్లగ్‌ను తొలగించి, వేడి తగ్గిన తర్వాత శుభ్రం చేయాలి.
  • సాధారణ వాటర్ కెటిల్‌లో నేరుగా పాలు, టీ పొడి లేదా కాఫీ పొడి వేసి మరిగించకూడదు. నీటిని మాత్రమే వేడి చేసి కప్పులో సిద్ధం చేసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *