Headlines

పెళ్లి పీటల నుంచి పోలింగ్ బూత్ కు.. అక్కడ వధువు.. మరోచోట వరుడు.. !


ఏపీలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో.. అనకాపల్లి జిల్లాలో ఆసక్తికరమైన, ఆదర్శవంతమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టమైన వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే.. ఓ వధువు, మరో వరుడు తమ పౌర బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి పీటల మీద నుంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వివాహ వస్త్రాలు, తలంబ్రాల కళ్యాణ వేషధారణతోనే పోలింగ్ కేంద్రానికి నేరుగా చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి బట్టలతో పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టిన వారిని చూసి అక్కడున్న ఎన్నికల అధికారులు, తోటి ఓటర్లు ఆశ్చర్యం తో పాటు అభినందనలు తెలిపారు. ఈ ఘటన రెండు వేరువేరు చోట్ల జరిగింది.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పెళ్లి దుస్తుల్లోనే వచ్చింది నవవధువు చిటికెల రాజ్యలక్ష్మి. పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది.
బుధవారం (నవంబర్ 25) రాత్రి అన్నవరంలో వివాహం జరిగింది. నేరుగా రోలుగుంట మండల కేంద్రంలోని పోలింగు కేంద్రానికి వచ్చి నవవధువు రాజ్యలక్ష్మి ఓటు వేసింది. గ్రామ అభివృద్ధి కోసం బాధ్యతగా ఆ మాత్రం చేయాలి కదా అంటోంది రాజలక్ష్మి.

పెళ్లి బట్టలతోనే పోలింగ్ బూత్‌కు వరుడు..!

ఇక.. రావికమతంలో ఓ వరుడు.. పెళ్లి బట్టలతోనే పోలింగ్ బూత్ కి వచ్చాడు. ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రావికమతం మండలం చినపాచిల గ్రామంలో గౌరీ నాయుడు వివాహం ఈ తెల్లవారుజామున జరిగింది. పెళ్లి క్రతువులు ముగించుకుని.. పోలింగ్లో పాల్గొనాలని అనుకున్నాడు. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే.. కుటుంబ సభ్యులు సన్నిహితులకు చెప్పి పోలింగ్ బూత్ వైపు వెళ్ళాడు. పెండ్లి పీటల నుండి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకున్న నవ వరుడు కె గౌరినాయుడు ను అందరూ అభినందించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *