దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆకాశంలో ఒక తార. పవన్ సాధినేని తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్, సుమంత్, అడివి శేష్, అల్లరి నరేష్, శివ నిర్వాణ, నాని తదిర సినీ ప్రముఖులు ఆకాశంలో ఒక తార సినిమాను చూసి మెచ్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాశంలో ఒక తార సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హృదయానికి హత్తుకునేలా గొప్ప సందేశం ఇచ్చారని ఈ సందర్భంగా నటీనటులు, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు అనిత. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో కలిసి ఈ సినిమాను చూడాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
‘ఆకాశంలో ఒక తార సినిమా చూశాను. చక్కటి కథాంశం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, గొప్ప స్ఫూర్తినిచ్చే సందేశంతో ఈ సినిమా నన్ను ఆలోచింపజేసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన చిత్రం ఇది. ఒక ఆడపిల్ల కలలకు తల్లిదండ్రుల నమ్మకం తోడైతే, సమాజం విధించే హద్దులను దాటి, ఆకాశాన్ని కాదు… అంతరిక్షాన్నే తన గమ్యంగా మార్చుకోగలదు. ఆమె కలలకు రెక్కలివ్వాలే తప్ప, హద్దులు విధించకూడదనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా అందించింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారితో పాటు నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.ఇంత మంచి కథను ఎంచుకుని, తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు పవన్ సాధినేనికి నా ప్రత్యేక అభినందనలు. విభిన్నమైన చిత్రాలతో పాటు, హృదయానికి హత్తుకునే కథలను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న స్వప్న సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌లకు, అలాగే ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు అనిత. ఇక ఏపీ హోంమంత్రి ఎక్స్ పోస్టుపై గీతా ఆర్ట్స్ స్పందిస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీ హోం మంత్రి అనిత ట్వీట్..
#AakasamloOkaTara సినిమా చూడడం జరిగింది. చక్కటి కథాంశం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, గొప్ప స్ఫూర్తినిచ్చే సందేశంతో ఈ సినిమా ఆలోచింపజేసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన చిత్రం ఇది.
ఒక ఆడపిల్ల కలలకు తల్లిదండ్రుల నమ్మకం తోడైతే, సమాజం విధించే హద్దులను దాటి, ఆకాశాన్ని కాదు… అంతరిక్షాన్నే తన గమ్యంగా మార్చుకోగలదు. ఆమె కలలకు రెక్కలివ్వాలే తప్ప, హద్దులు విధించకూడదనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా అందించింది.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారితో పాటు నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
ఇంత మంచి కథను ఎంచుకుని, తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు పవన్ సాధినేనికి నా ప్రత్యేక అభినందనలు.
విభిన్నమైన చిత్రాలతో పాటు, హృదయానికి హత్తుకునే కథలను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న స్వప్న సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌లకు, అలాగే ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.
@dulQuer @pavansadineni @satveeravalli @shrutihaasan @iRuhaniSharma @SwapnaCinema @GeethaArts @Lightboxoffl @grajug @gvprakash @sujithsarang
#AndhraPradeshHM #homeminister #anithavangalapudi #hyderabad
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.