Headlines

వైజాగ్ బే-టెక్ సిటీ ప్రచారంపై VMRDA క్లారిటీ


వైజాగ్ బే టెక్ సిటీకి సంబంధించి వీఎంఆర్‌డీఏ కీలక స్పష్టత ఇచ్చింది. విశాఖపట్నం పేరు మారుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో 52 చదరపు కిలోమీటర్ల ప్రతిపాదిత ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా బే టెక్ సిటీ అనే పేరును ప్రత్యేక ప్రాజెక్టు ప్రాంతానికి మాత్రమే ప్రతిపాదించినట్లు వివరించింది. హైదరాబాద్‌లో సైబరాబాద్ మాదిరిగానే విశాఖకు అనుబంధంగా మరో నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కైలాసగిరి నుంచి భీమిలి వరకు సుమారు 52 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, ఎనర్జీ, ఫార్మా, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి రంగాలను ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కేవలం కొత్తగా నిర్మించబోయే టెక్ కారిడార్ ప్రాజెక్టు ప్రాంతానికి మాత్రమే వైజాగ్ బే టెక్ సిటీ పేరు వర్తిస్తుందని, విశాఖపట్నం నగర పేరులో ఎటువంటి మార్పు ఉండదని వీఎంఆర్‌డీఏ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, స్టార్టప్ లను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కాపులుప్పాడలో 500 ఎకరాల్లో ఐటీ, డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *