తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలనటులలో అనీ ఒకరు. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘రాజన్న’ (2011) చిత్రంలో ఆయన కూతురు మల్లమ్మ పాత్రలో నటించి ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. అమాయకత్వం, భావోద్వేగాలతో నిండిన ఆ పాత్ర ఆమెకు అద్భుతమైన గుర్తింపుతో పాటు నంది, ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను సైతం తెచ్చిపెట్టింది. చిన్ననాటి మల్లమ్మగా కనిపించిన ఆని, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆమె ప్రస్తుత కెరీర్ ఎలా సాగుతోంది? అనే వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 2005లో వచ్చిన ‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాతో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన ఆని, ఆ తర్వాత ‘విక్రమార్కుడు’, ‘స్టాలిన్’, ‘అతిథి’, ‘శౌర్యం’, ‘ఏక్ నిరంజన్’, ‘ఖలేజా’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిశారు. బుల్లితెరపై ‘అమృతం’, ‘గోరింటాకు’ వంటి కార్యక్రమాలతో పాటు టెలిఫిల్మ్లలోనూ నటించి బహుళ నంది అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా ‘రాజన్న’లో మల్లమ్మగా ఆమె నటన సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఆ తర్వాత బాలనటి స్థాయి నుంచి ఎదిగిన ఆని, 2018లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’ లో రామ్ చరణ్ చెల్లెలి పాత్రలో కనిపించి యువ నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘తిక మక తాండ’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ‘యేవమ్’, ‘నిందా’, ‘మా నాన్న సూపర్‌హీరో’ వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఆని చురుగ్గా రాణిస్తుంది. ‘లూజర్’ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత ‘హోమ్టౌన్’, ‘వీరభద్రుని రహస్యం’, ‘తోలు బొమ్మలు’ వంటి సిరీస్‌లలో నటించి తన నటనా పరిధిని చాటుకున్నారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న ఆని, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, అప్డేట్స్తో అభిమానులకు దగ్గరవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
అనీ పోస్ట్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..