Headlines

70 సినిమాలు.. 50 ఏళ్లకే కన్నుమూసిన కమెడియన్! ఆయన కొడుకులు ఇప్పుడు టాలీవుడ్ హీరోలు


సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు గుర్తుండిపోవాలంటే వందల సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. తెరపై కనిపించింది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేయొచ్చు. అలాంటి నటుల్లో కమెడియన్ లక్ష్మీపతి ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఆయన.. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 50 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు. అయితే లక్ష్మీపతి కుటుంబం నుంచి ప్రస్తుతం ఇద్దరు యువ హీరోలు టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారు మరెవరో కాదు.. సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. వీరిద్దరూ లక్ష్మీపతికి స్వయానా కొడుకులు కాకపోయినా.. ఆయనకు ఎంతో ఆప్తులు. ఇంతకీ వీరి కుటుంబ నేపథ్యం ఏంటి? లక్ష్మీపతి సినీ ప్రయాణం ఎలా సాగింది? ఇప్పుడు చూద్దాం.

లక్ష్మీపతి నటుడిగా మారకముందు రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. కథ, మాటల రచనపై పట్టు సాధించారు. ఆ తర్వాత దర్శకత్వ విభాగంలోనూ పనిచేస్తూ సినిమా నిర్మాణంలోని అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాతో లక్ష్మీపతి నటుడిగా తెరపై కనిపించారు. చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం.. క్రమంగా మంచి అవకాశాలను అందుకునే స్థాయికి చేరుకుంది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘మురారి’ సినిమా లక్ష్మీపతి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది.  ఈ సినిమా తర్వాత లక్ష్మీపతికి మరిన్ని అవకాశాలు రావడం మొదలైంది.

‘జయం’, ‘అల్లరి’ వంటి సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ‘పెదబాబు’, ‘ఆంధ్రుడు’ చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. చిన్న పాత్ర అయినా తనదైన శైలిలో నవ్వులు పంచడం లక్ష్మీపతి ప్రత్యేకతగా నిలిచింది. లక్ష్మీపతి కుటుంబంలో మరో సినీ ప్రముఖుడు దర్శకుడు శోభన్. ఆయన లక్ష్మీపతికి తమ్ముడు.  మహేష్ బాబు నటించిన ‘మురారి’ సినిమాకు మాటలు రాసిన శోభన్.. ఆ తర్వాత ‘బాబీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతో ఆశించిన ఫలితం అందుకోకపోయినా.. తన ప్రతిభతో తదుపరి అవకాశాన్ని అందుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘వర్షం’ సినిమాతో శోభన్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే కీలకమైన విజయంగా నిలవడంతో పాటు దర్శకుడిగా శోభన్‌కు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక శోభన్ మరో కుమారుడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా దూసుకుపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *