Headlines

Andhra News: రెండ్రోజుల్లో పోలింగ్.. కట్‌చేస్తే ఎన్నికల బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్ధికి జైలు శిక్ష..


మరో రెండ్రోజుల్లో ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బాపట్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 38వ వార్డు నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న ఉసా తులసీ రావుకు ఓ కేసులో కోర్టు నాలుగు నెలల జైలు విక్షతో పాటు రూ.1500ల ఫైన్ విధించింది. దీంతో ఆయన ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్న చర్చ మొదలైంది. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో తులసీ రావు పోటీకి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. కోర్టు అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేసి, ఆ తర్వాత అప్పీల్‌కు వెళ్లాలా వద్దా అన్నది ఆయన నిర్ణయించుకోవచ్చని తెలుస్తోంది.

అసలేం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. ఉసా తులసీ రావుపై 2016లో ఒక కేసు నమోదైంది. ఓ మహిళను అసభ్యకరంగా దూషించిన ఘటనలో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తాజాగా ఈ కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు ఆయనకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది.

ప్రస్తుతం బాపట్లలో మున్సిపల్ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ తరుణంలో ఇలా వైసీపీ అభ్యర్థికి కోర్టు జైలు శిక్ష విధించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తులసీ రావు పేరు ఇప్పుడు కోర్టు తీర్పుతో మరోసారి పట్టణంలో మారుమోగుతోంది. ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే, శిక్షపై అప్పీల్‌కు వెళ్లాలా వద్దా అన్న విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *