‘జబర్దస్త్’ కారణంగా బాగా పాపులర్ అయిన కమెడియన్స్ లో ఫణి ఒకరు. ముఖ్యంగా ఈ కామెడీ షోలో తాగు బోతు పాత్రలతో బాగా ఫేమస్ అయ్యారీ కమెడియన్. మిమిక్రీ, వెంట్రిలాక్విజం, ఈవెంట్ హోస్టింగ్‌లోనూ ప్రావీణ్యమున్న ఫణి ‘జబర్దస్త్’తో పాటు ‘నవ్వుతూ బతకాలి’ తదితర కామెడీ షోల్లో సందడి చేశారు. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించారు. ‘పంబలకడి జంబా’, ‘ఓ మై గాడ్’, ‘కారులో శికారుకెళితే’, ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’, ‘ప్రేమలో రెండోసారి’, ‘నా నీ ప్రేమ కథ’, ‘తక్షకుడు’, ‘బహిర్బూమి’ తదితర చిత్రాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు ఫణి. అయితే ఒకప్పుడు టీవీ షోస్ తో పాటు సినిమాలతో బిజీ బిజీగా కనిపించిన ఫణి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం బుల్లితెరపై ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫణి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యార. ‘ నిజం చెప్పాలంటే.. ఈ మధ్య కాలంలో నేను బాగా స్లో అయ్యాను అనే చెప్పాలి. సినిమా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఒకానొక సమయంలో నా భార్య అనారోగ్య కారణాల వలన, నేనే దగ్గరుండి తనని చూసుకోవలసి వచ్చింది. నా భార్య సర్వైకల్ స్పాండిలైటిస్‌తో బాధపడింది, ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయలేదు. దాదాపు ఒక సంవత్సరం పాటు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. దీంతో ఆ సమయంలో నేను అంతగా సినిమాలు చేయలేకపోయాను. ఇప్పుడు చేద్దామని ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. ఎవరి నుంచైణా ఫోన్ కాల్ చేస్తే ఛాన్స్ వచ్చినట్టేనని సంబరపడిపోవలసి వస్తోంది’
‘మొదటి నుంచి కూడా నేను ఎవరినీ నాకు ఇది కావాలని అడగను. డిమాండ్ చేయను. నా దగ్గరకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లాను. సినిమా ఇండస్ట్రీలో నాకు అంతా తెలిసినవారే .. అందరికీ టచ్ లోనే ఉంటున్నాను. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇప్పుడు నా కెరియర్ చాలా స్లో అయింది. కేవలం సినిమాలను మాత్రమే నమ్ముకుని ఉండడం కరెక్టు కాదేమో అని కూడా అనిపిస్తోంది. దేనికైనా టైమ్ రావాలి .. అలాంటి టైమ్ నాకు మళ్లీ వస్తుందనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశాడు ఫణి. కాగా ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాల్లో నటిస్తున్నాడు ఫణి. అలాగే ఈవెంట్స్ కు కూడా వెళుతున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నాడు. ఇప్పుడు వీటి ద్వారా వచ్చిన అదాయంతోనే తన ఫ్యామిలీని పోషిస్తున్నాఆడు ఫణి. కాగా ఈ జబరద్స్త్ కమెడియన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఈవెంట్ లో జబర్దస్త్ ఫణి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.