దక్షిణాది సినిమా పరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానంతో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తల్లి, అత్త వంటి కీలక పాత్రల్లో తన నటనతో మెప్పిస్తూ బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్లు, స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరు, జీవిత సూత్రాలు, అవార్డులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు, అవరోధాలు ఎదుర్కొన్నట్లు రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఓ దశలో ఇండస్ట్రీలో తనపై “ఐరన్ లెగ్” అనే ముద్ర పడిందని, సినిమాలు వద్దు అనుకుని వెళ్ళిపోదామనుకునే పరిస్థితులు కూడా వచ్చాయని తెలిపారు. అయితే ఆ క్లిష్ట సమయం నుంచి బయటపడి, తాను స్టార్ హీరోయిన్గా నిలబడటానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారే ప్రధాన కారణమని చెప్పారు. రాఘవేంద్రరావు తనకు దైవసమానమైన ఆశీర్వాదంలా నిలిచారని, ఆయన లేకపోతే ఆ కష్టాలను అధిగమించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని భావోద్వేగంగా పేర్కొన్నారు. తన కెరీర్లో ‘అల్లుడు గారు’ చిత్రం పెద్ద మలుపుగా నిలిచిందని, ఆ తర్వాత ‘అల్లరి మొగుడు’ వంటి సినిమాలతో మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
చెన్నై, హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తున్నట్లు రమ్యకృష్ణ తెలిపారు. కష్టపడి పనిచేయడం, ప్రశాంతంగా, సంతోషంగా జీవించడం, వీలైతే ఇతరులను సంతోషపెట్టడం లేదా కనీసం ఎవరికీ హాని చేయకుండా ఉండటమే తన జీవన సూత్రమని చెప్పారు. అవార్డుల గురించి మాట్లాడుతూ.. ప్రారంభంలో అవార్డులపై ఆసక్తి ఉండేదని, కానీ కాలక్రమేణా వాటిపై వ్యామోహం తగ్గిపోయిందని, “అవార్డ్స్ డజంట్ మ్యాటర్” అని స్పష్టం చేశారు. మంచి పాత్రలు చేయడం, పని పూర్తయ్యాక ఇంటికి వచ్చి సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వంటి దక్షిణాది భాషలన్నింటిలో నటించిన రమ్యకృష్ణ, తాను చేసిన చిత్రాల సంఖ్యను లెక్కపెట్టుకోలేదని చెప్పారు. గెస్ట్ అప్పియరెన్సులు, ప్రత్యేక గీతాల్లో కనిపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయని, తన సుదీర్ఘ ప్రయాణంలో లభించిన అనుభవాలను ఎంతో విలువైనవిగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..