Headlines

చికెన్, పెరుగు కలిపి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అస్సలు లైట్ తీసుకోవద్దు..


బిర్యానీ, తందూరి చికెన్, మొఘలాయ్ కర్రీ వంటి వంటకాలలో చికెన్‌ను మసాలాలలో నానబెట్టేటప్పుడు పెరుగు వాడటం మన దేశంలో చాలా సాధారణం. మాంసం మెత్తగా, రుచిగా ఉండటానికి వంటల్లో పెరుగును ఉపయోగిస్తుంటారు. అయితే చికెన్, పెరుగులను కలిపి తినడం వల్ల కలిగే పరిణామాలపై వైద్యులు, ఆయుర్వేద నిపుణులు, ఆహార నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మసాలా మిశ్రమం కలిపేటప్పుడు పెరుగును సరైన మోతాదులో ఉపయోగించరు. మరీ పుల్లగా ఉన్న పెరుగును లేదా ఎక్కువ పెరుగును వాడితే వండేటప్పుడు చికెన్ నుంచి అదనపు నీరు బయటకు వస్తుంది. దీనివల్ల చికెన్ ముక్కలు రబ్బరులా మారే ప్రమాదం ఉండటమే కాకుండా అసలైన మసాలాల రుచి కూడా తగ్గిపోతుంది. అందుకే కొందరు చెఫ్‌లు, ఇంటి వంటకాలు చేసేవారు చికెన్‌కు పెరుగు వాడకపోవడమే మంచిదని సూచిస్తారు.

ఆయుర్వేద కోణం ఏమిటి?

ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు, మాంసం కొన్నిసార్లు పరస్పరం విరుద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు. పెరుగు స్వభావరీత్యా పుల్లగా, చల్లగా ఉంటుంది. చికెన్ వేడిగా ఉంటుంది. భిన్న గుణాలు కలిగిన ఈ రెండింటినీ కలిపి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట చికెన్, పెరుగు కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.

జీర్ణక్రియ, అలెర్జీ సమస్యలు

పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం చికెన్‌లోని ప్రోటీన్‌పై ప్రభావం చూపుతుంది. పెరుగు ఎక్కువ పుల్లగా ఉన్నా లేదా చికెన్‌ను పెరుగులో ఎక్కువసేపు నానబెట్టినా సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల కడుపులో బరువుగా అనిపించడం, కడుపు ఉబ్బరం, కొందరికి విరేచనాలు లేదా గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు.

అంతేకాకుండా పెరుగు, మాంసం కలిపి తిన్నప్పుడు కొందరిలో చర్మపు చికాకు, దద్దుర్లు లేదా అలెర్జీ లక్షణాలు తలెత్తవచ్చు. ఇప్పటికే పాలు, పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు చికెన్‌తో పెరుగును దూరంగా ఉంచడం మేలని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *