ఇప్పుడు కూర కోసం మళ్ళీ పాన్ లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు , కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.
ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేవరకు వీటిని వేపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి , చింతపండు రసం, నీళ్లు పోసి, గ్రేవీ చిక్కబడిన తర్వాత మిరపకాయ బజ్జీలను వేసి దించేయండి.