Headlines

Jaya Prakash Reddy: ఆయన పెద్ద హీరో.. కానీ నన్ను చూడగానే లేచినిలబడతాడు.. టాలీవుడ్ నటుడు..


టాలీవుడ్ దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన విషయాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సమరసింహారెడ్డి సెట్స్‌లో ఆయన గడిపిన క్షణాలను, బాలకృష్ణతో తన అనుభవాలను ఆయన స్వయంగా పంచుకున్నారు. ఈ చిత్రం జయప్రకాశ్ రెడ్డి జీవితంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, జయప్రకాశ్ రెడ్డి తాను ఒకప్పుడు దర్శకుడిగా ప్రయత్నించి విఫలమై, సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నానని తెలిపారు. ఆ కష్టకాలంలో కుటుంబ సభ్యుల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, తన భార్య తన కారణంగా ఏడుస్తున్నప్పుడు తన ఆవేదన వర్ణనాతీతమని చెప్పారు. అటువంటి సమయంలో, ఒక స్నేహితుడు ధర్మవరంలో ఉన్న తనను చెన్నైకి తీసుకువచ్చి, ఆడిషన్స్‌లో పాల్గొనేలా ప్రోత్సహించారని జయప్రకాశ్ రెడ్డి వివరించారు. ఆడిషన్స్‌లో ఎంపికైన తర్వాతే తన జీవితం తిరిగి పట్టాలెక్కిందని ఆయన అన్నారు. ఈ ప్రయాణంలోనే ఆయనకు బాలాజీ ఆర్ట్స్ నిర్మించిన, బి. గోపాల్ దర్శకత్వం వహించిన సమరసింహారెడ్డి చిత్రంలో అవకాశం లభించింది.

ఈ సినిమా చిత్రీకరణ బళ్ళారిలో జరుగుతున్న సమయంలో బాలకృష్ణ వృత్తిపరమైన అంకితభావాన్ని జయప్రకాశ్ రెడ్డి ప్రత్యక్షంగా చూశారు. బాలకృష్ణ ప్రతి రోజూ ఉదయం ఏడు గంటలకే సెట్స్‌కు చేరుకునేవారని, ఇది ఆయన క్రమశిక్షణకు నిదర్శనమని జయప్రకాశ్ రెడ్డి అన్నారు. బళ్ళారిలో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, ఆయన 100 అడుగుల కటౌట్‌లు ఉండేవని చెప్పారు. మేకప్ రూమ్‌లో కూర్చుని సంభాషణల పేపర్లను అడిగి, కేవలం ఐదు నిమిషాల్లోనే పేజీల కొద్దీ డైలాగులను గుర్తుంచుకునేవారని, ఇది చూసి తాను ఆశ్చర్యపోయానని జయప్రకాశ్ రెడ్డి వివరించారు. కెమెరా ముందుకు వచ్చి, ఒకసారి కెమెరా వైపు చూసి, సంభాషణలు చెప్పడం మొదలుపెడితే అది బాలయ్యకే సాధ్యమని ఆయన కొనియాడారు. తాను సెట్ లోకి వెళ్లగానే ఆయన చైర్ లో నుంచి లేచి తనకు కుర్చీ ఇచ్చేవారని.. పర్లేదు అని చెప్పినా వినేవారు కాదని చెప్పుకొచ్చారు.

ఒక రోజు తాను బాలకృష్ణను అడిగానని, “మీరు ఇంత సులభంగా సంభాషణలు ఎలా చెబుతున్నారు?” అని ప్రశ్నించినప్పుడు, బాలకృష్ణ భావోద్వేగంతో స్పందించారని జయప్రకాశ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. “మా నాన్నగారు పోయారు . దేవుడు ఆయన్ని తీసుకెళ్లి ఈ శక్తిని నాకు ఇచ్చాడు రా. ఆయనే ఇక్కడి నుండి చెప్తుంటాడు రా” అని బాలకృష్ణ సిన్సియర్‌గా చెప్పినట్లు జయప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. బాలకృష్ణకు కోపం ఎక్కువ అనే అభిప్రాయం చాలా మందిలో ఉందని, అయితే తాను సెట్స్‌లో చూసిన బాలకృష్ణ వేరని జయప్రకాశ్ రెడ్డి అన్నారు. తాను బాగా చల్లని నీళ్లు తాగే అలవాటు ఉన్నానని, ఒకరోజు బాలకృష్ణ తనను పిలిచి, “ఎందుకురా ఆ నీళ్లు తాగుతున్నావు? మామూలు నీళ్లు తాగరా. గొంతు పోతుంది రా” అని ఆప్యాయంగా చెప్పారని జయప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

జయప్రకాష్ రెడ్డి, బాలకృష్ణ..

Jayaprakash Reddy, Balakris

Jayaprakash Reddy, Balakris

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *