Headlines

కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే సొంతం చేసుకోండి.. జాక్‌పాట్ అంటే ఇది కదా..


కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే సొంతం చేసుకోండి.. జాక్‌పాట్ అంటే ఇది కదా..

ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుతుండగా.. దేశీయంగానూ అదే బాటలో నడుస్తున్నాయి. దేశంలో పసిడి ధరలు డౌన్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పడిపోవడం కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కల్గిస్తోంది. ధర చౌకగా మారుతుండటంతో కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలుకావడంతో గోల్డ్ సేల్స్ పెరుగుతున్నాయి. ఇక ఫిజికల్ రూపంలో బంగారం కొనుగోలు చేసేవారే కాకుండా.. ఈటీఎఫ్ రూపంలో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈటీఎఫ్‌లలో ఒక్క యూనిట్ బంగారం రూ.12కే లభిస్తుండగా.. సిల్వర్ ఒక్కొ యూనిట్ రూ.15కే వస్తోంది.

ధరలు తగ్గుతుండటంతో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల వైపు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ ఒక్కొ యూనిట్ సుమారు రూ.12కే లభిస్తోండగా.. గ్రోవ్ గోల్డ్ ఈటీఎఫ్ రూ.12కు దొరుకుతుంది. ఇక ఏంజెల్ వన్ గోల్డ్ ఈటీఎఫ్ రూ.12కు, డీఎస్పీ గోల్డ్ ఈటీఎఫ్ సుమారు రూ.12కు అందుబాటులో ఉన్నాయి. వెండి విషయానికొస్తే.. ఒక్కో యూనిట్ ETFల ద్వారా రూ.15కే లభిస్తోందని చెప్పవచ్చు. టాటా సిల్వర్ ETF, గ్రోవ్ సిల్వర్ ETF, కోటక్ సిల్వర్ ETF, DSP సిల్వర్ ETF, క్వాంట్ సిల్వర్ ETFలు ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.15 పలుకుతున్నాయి. యాంగిల్ వన్ సిల్వర్ ETF యూనిట్ రూ.15కే అందుబాటులో ఉంది. ఒక్కో యూనిట్ ధర తక్కువకు లభిస్తుండటంతో పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ETFకు సంబంధించి యూనిట్ ధర (NAV) అనేది ఫండ్ హౌస్ ఒక యూనిట్‌కు అనుసంధానించిన బంగారం లేదా వెండి పరిమాణం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. 10 గ్రాముల బంగారం ధర రూ.1.21 లక్షలుగా ఉందనుకుంటే.. 0.001 గ్రాము బంగారం విలువ సుమారు రూ.12గా ఉంటుంది. భౌతిక బంగారం కొనుగోలు చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఈటీఎఫ్‌లలో సిప్ రూపంలో ఒక్క యూనిట్ రూ.12 నుంచి రూ.15కే కొనుగోలు చేయవచ్చు. బంగారం, వెండిలో చిన్న పెట్టుబడులు పెట్టేవారికి ఇది ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. కాగా ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం ఏయూఎం (AUM) రూ.1,86,310 కోట్లను దాటింది. అదే సమయంలో సిల్వర్ ఈటీఎఫ్‌ల మొత్తం ఏయూఎం రూ.81,636 కోట్లకు చేరుకుంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI)  డేటా ప్రకారంగత సంవత్సర కాలంలో భారతీయలు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో రూ.88,505 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. వీటిలో రూ.64,788 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి, రూ.23,717 కోట్లు సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. కేవలం 2026 జనవరిలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.24,040 కోట్ల రికార్డు స్థాయి నెలవారీ పెట్టుబడి నమోదైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *