ముందుగా మిక్సీ జార్లో నిమ్మకాయ సైజులో ఉన్న నాలుగు ఉసిరికాయ ముక్కలు, ఒక టీస్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టమాటో లేదా రెండు చిన్న టమాటోలు కట్ వేసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్ళు పోసి, మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు చిటికెల ఇంగువ వేసి, ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి.