Headlines

డబ్బుల వర్షం కురిపిస్తానంటూ గాల్లోకి నిమ్మకాయల్ని లేపాడు.. అర్థరాత్రి అర్థనగ్నంగా కూర్చుని..


మహారాష్ట్రలోని అకోలాలో నరబలి వ్యవహారం కలకలం రేపుతోంది.. డబ్బుల వర్షం కురిపిస్తానంటూ తాంత్రికుడు విక్కీ షిండే అనే వ్యక్తి పూజలు చేయడం.. ఇదే క్రమంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి తాంత్రికుడు విక్కీ షిండేని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్, అకోలాలో కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రలో రెండురోజులుగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విక్కీ షిండే అనే వ్యక్తి పూజలు చేస్తున్నాడు. నిమ్మకాయలను గుట్టలుగా పోసి తాంత్రిక విద్యలు ప్రదర్శించాడు. గాల్లోకి నిమ్మకాయల్ని లేపాడు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇదే వీడియోకి సంబంధించిన కేస్ మరొకటి కుదిపేస్తోంది. ఈ పూజల కోసమే హేమంత్ సత్పాల్ అనే యువకుడిని బలిచ్చినట్లు కేసు నమోదైంది.

అకోలాకి చెందిన హేమంత్ సత్పాల్‌.. ఉజ్జయిని మహాకాలుడి దర్శనం కోసం స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత ఇండోర్ సమీపంలో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. అతనితో ఉన్న స్నేహితులు ఏమైపోయారు.. వాళ్లకీ ఈ నరబలికి సంబంధం ఉందా.. అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం హేమంత్‌ని నరబలి ఇచ్చారని రోదిస్తోంది. న్యాయం కోసం కన్నీరు పెట్టుకుంటోంది.

డబ్బుల వర్షం కురిపిస్తానని నమ్మించి ఆ తాంత్రికుడు ఈ పూజలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఎవరికోసం డబ్బుల వర్షం కురిపిస్తానన్నాడు. దానికి హేమంత్ వెళ్లాడా.. లేదంటే హేమంత్‌ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి నరబలి ఇచ్చారా. దీని వెనుక మాత్రం ఏవో అనుమానాలు, ఇంకొన్ని ముఠాలు ఉన్నట్లుగా అనుమానాలున్నాయి. కేసును కేవలం అకోలాకి పరిమితం చేయకుండా.. లింకుందని భావిస్తున్న ఇండోర్‌లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *