Headlines

Tollywood : శ్రీదేవి అంటే నాకు అస్సలు నచ్చదు.. ఆమె ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. టాలీవుడ్ నటి..


తెలుగు, హిందీ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి తల్లూరి రామేశ్వరి. నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా కనిపించింది. అలాగే తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ ప్రముఖులు, నటన పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంతో తన అనుబంధం నుంచి, దివంగత నటి శ్రీదేవి, సీనియర్ నటి వాణిశ్రీల నటనా శైలి వరకు పలు అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బోనీ కపూర్ కుటుంబానికి తాను చాలా దగ్గరని తల్లూరి రామేశ్వరి తెలిపారు. బోనీ కపూర్ తండ్రి, నిర్మాత సురేంద్ర కపూర్ తనను సొంత కూతురిలా ఆదరించేవారని, అలాగే బోనీ మొదటి భార్య మోనా కపూర్‌తో కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మరణం అనంతరం బోనీ కపూర్‌పై వచ్చిన విమర్శలు, ఆరోపణలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అత్యంత ఆత్మీయులను కోల్పోయిన క్లిష్ట సమయంలో అలాంటి నిరాధారమైన మాటలు అనడం అన్యాయమని అన్నారు. మనుషుల్లోని మంచి కోణాన్ని చూడటానికే తాను ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

నృత్యంలో, నటనలో శ్రీదేవికి ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమె నటన తనకు కొంత “ప్రోగ్రామ్డ్”గా అనిపించేదని రామేశ్వరి పేర్కొన్నారు. ఏ హావభావం ఎప్పుడు, ఎలా చూపించాలనేది ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకున్నట్టుగా అనిపించడం వల్ల, వ్యక్తిగతంగా తాను శ్రీదేవి నటనతో పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోయానని చెప్పారు. అలాగే పేదరికం నేపథ్యం ఉన్న సన్నివేశాల్లోనూ శ్రీదేవి పాత్రల వేషధారణ వాస్తవికతకు భిన్నంగా, కొంత కృత్రిమంగా కనిపించేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

శ్రీదేవి శైలికి భిన్నంగా సీనియర్ నటి వాణిశ్రీ నటనను రామేశ్వరి ప్రశంసించారు. వాణిశ్రీ అభినయంలో ఎలాంటి తడబాటు లేదా కృత్రిమత్వం లేకుండా ఎంతో సహజంగా, సునాయాసంగా సాగేదని అన్నారు. సాదాసీదా జడ, చిన్న చెవిపువ్వులు వంటి సింపుల్ లుక్స్‌లోనూ ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవారిని, ఆ స్థాయి సహజత్వాన్ని శ్రీదేవి పాత్రల్లో చూడలేకపోయానని రామేశ్వరి తన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *