Headlines

హీరోయిన్ – విలన్‌ మధ్య కొట్లాట.. ఎవ్వరూ తగ్గట్లేగా..


బాలీవుడ్‌లో ఎప్పుడూ కూల్‌గా, ఎంతో హుందాగా ఉండే నటి దియా మీర్జా ఒక్కసారిగా తన సహనం కోల్పోయింది. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే దియా, ఏకంగా నవాజుద్దీన్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ తిన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రవర్తనపై దియా మీర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. “ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా ఒక పీడకల లాంటిది. కనీసం మాట్లాడే పద్ధతి కూడా తెలియదు, యాటిట్యూడ్ అయితే ఏకంగా వేరే లెవల్‌. అత్యంత అభ్యంతరకరమైన క్యారెక్టర్. అంటూ దియా రాసుకొచ్చింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే దియా .. ఒక్క సారిగా ఇలాంటి ట్వీట్ చేయడంతో.. అందరూ షాకవుతున్నారు. ఇక దియా మీర్జా చేసిన ఈ విమర్శలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా అంతే వేగంగా, ఘాటుగా రియాక్టయ్యారు. ఆమె పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. “ఒకరి యాటిట్యూడ్‌లో లోపాలు వెతకడం చాలా తేలిక.. దమ్ముంటే నా పనిలో తప్పులు వెతికి చూపించండి” అంటూ సవాల్ విసిరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. బాలీవుడ్ నటుడి దయనీయ స్థితి

Monalisa Bhosle: చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుందా.. మోనాలిసా ఇప్పుడేం చేస్తోంది

Sudigali Sudheer: సొంత సినిమాను గాలికొదిలేశాడు! సుధీర్ తీరుపై తీవ్ర విమర్శలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *