టాలీవుడ్లో కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు కొత్త కథలను ఎంచుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయితే వీరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించే అవకాశాలు అందుకోవడం యంగ్ బ్యూటీస్‌కు అంత సులభం కాదు.