రాగులు, జొన్నలు, సజ్జలు.. ఈ మూడూ చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు వీటి పోషక విలువలు మాత్రం భిన్నంగా ఉంటాయి. మరి ఈ మూడింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో న్యూఢిల్లీలోని ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ గిన్నీ కల్రా ప్రకారం ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.
జొన్నలు:ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సూపర్‌గా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు రోజు ఒక జొన్న రొట్టె తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, ఇవి గ్లూటెన్-ఫ్రీ కావడం వల్ల అలర్జీల నుంచి రక్షణ కల్పిస్తాయి.
రాగులు : వీటిలో మన ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది, డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి రాగులు ఒక అద్భుతమైన ఎంపిక.
సజ్జలు: సజ్జలలో ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని అనేక వ్యాధులు దూరమవుతాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడటంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతాయి. అంతేకాదు చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంతో ఇవి సహాయపడుతాయి.
మూడింటిలో ఏది బెస్ట్: అయితే మీ అవసరాలను బట్టి మీకు ఏది బెస్ట్ అనేది నిర్ణయించబడుతుంది. మీకు ఎముకల ఆరోగ్యం కోసమైతే కాల్షియం అధికంగా ఉండే రాగులు మంచివి అదే మీరు షుగర్‌ను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మీరు జొన్నలు మంచివి. అలాగే తక్షణ శక్తి, రక్తహీనత సమస్యల నివారణకు సజ్జలు బెస్ట్. మొత్తంగా చూస్తే ఈ మూడు చిరుధాన్యాలు పోషకాల గనులే. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఈ మూడింటిని మార్చి మార్చి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అత్యంత ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.




