Headlines

Aditya Dhar: ఆ హీరోయిన్‌ది బంగారం లాంటి మనసు.. ఆమె వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను: ధురంధర్ డైరెక్టర్


Aditya Dhar: ఆ హీరోయిన్‌ది బంగారం లాంటి మనసు.. ఆమె వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను: ధురంధర్ డైరెక్టర్

బాలీవుడ్ ప్రముఖ జంట ఆదిత్య ధర్ , యామీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఒక అవార్డుల వేడుకకు వీరు జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వేదికపై ఒకరి కెరీర్, జీవిత ప్రయాణం గురించి మరొకరు మనసు విప్పి మాట్లాడారు. ఆదిత్య, యామీని తన జీవితంలో అదృష్ట దేవత అని ప్రశంసించగా, యామీ తన భర్త నిజాయితీని, కష్టపడి పనిచేసే తత్వాన్ని కొనియాడింది. తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, దర్శకుడు ఆదిత్య ధర్, “రాత్రికి రాత్రే స్టార్ అవ్వడానికి నాకు 20 ఏళ్లు పట్టింది” అని అన్నారు. ఆదిత్య ధర్ 2006లో కలలతో ముంబైకి వచ్చి, మొదట్లో సహాయ దర్శకుడిగా, గీత రచయితగా పనిచేశారు. 2019లో వచ్చిన ‘ఉరి’ చిత్రం ఆయనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టగా, ‘ధురందర్’ చిత్రం ఆయన కీర్తిని మరింత పెంచింది. “యామి నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణమే నా అదృష్టం మారిపోయింది” అని చెబుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆదిత్య యామీ గౌతమ్ నటనను ప్రశంసించాడు. “యామీది బంగారు మనసు. ఆమె అసలైన ప్రతిభలో 50 శాతం కూడా ప్రేక్షకులు ఇంకా చూడలేదు. ‘ఆర్టికల్ 370’, ‘హక్’ చిత్రాలలో యామీ అద్భుతంగా నటించింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప చిత్రాలు చేస్తుంది,” అని ఆదిత్య చెప్పుకొచ్చారు.

ఇక యామీ గౌతమ్ తన భర్త ఆదిత్య వ్యక్తిత్వాన్ని బహిరంగంగా ప్రశంసించారు. ‘సినీ పరిశ్రమలోని చేదు అనుభవాలు మనిషిని మార్చేస్తాయి. కానీ ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఆదిత్య తన మంచితనాన్ని కోల్పోలేదు. సినిమా సెట్స్‌లో నిద్ర లేకుండా వరుసగా 70 గంటలు పనిచేయాలనే అతని నిబద్ధత నిజంగా అద్భుతం,’ అని యామీ గుర్తుచేసుకున్నారు. ఇక తన వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నకు ఆదిత్య స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ‘మేము ఇంట్లో భార్యాభర్తలమైనప్పటికీ, పని విషయాలలో వృత్తి నైపుణ్యాన్ని పాటిస్తాం. నాకు ఏదైనా కొత్త సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కూడా, నేను దాని గురించి ఇంట్లో చర్చించను, అధికారిక మార్గాల ద్వారానే వారిని సంప్రదిస్తాను,’ అని ఆయన అన్నారు. 2021లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2024లో ‘వేదవిడ్’ అనే కుమారుడు జన్మించాడు.

భార్య యామీ గౌతమ్ తో డైరెక్టర్ ఆదిత్య ధర్..

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *