Headlines

తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు.. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ బోర్డు విలీనం!


తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే విద్యాశాఖ సంస్కరణలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియేట్ బోర్డును విలీనం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రక్రియను అధికారికంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నూతన విద్యా సంస్కరణలపై మరో 15 రోజుల్లో ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుండి ప్రభుత్వం అభిప్రాయాలను సేకరించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన అనంతరం, అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో విద్యాబోధన స్వరూపం పూర్తిగా మారిపోనుంది. కొత్త చట్టం ప్రకారం.. 2027-28 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో ‘సీనియర్ సెకండరీ’ విధానం అమల్లోకి రానుంది. దీనివల్ల 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు, అంటే సీనియర్ సెకండరీ విద్యావిధానం పరిధిలోకి వస్తాయి. ఈ మార్పులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇకపై ‘సీనియర్ సెకండరీ స్కూళ్లు’గా మారనున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ విలీన ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027-28లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను 2029-30 విద్యా సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యత పెరగడంతో పాటు, విద్యార్థులకు ఉన్నత చదువులకు బలమైన పునాది పడుతుందని విద్యాశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్‌లో కొత్త ట్రాన్స్‌పోర్ట్.. మరి ప్రయాణికుల కష్టాలు తీరుతాయా?

Vijay Antony: విజయ్ ఆంటోని చెప్పులు ఎందుకు ధరించడో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు

డాలర్‌ కు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. అసలు విషయం ఇదేనా?

నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ.. ఏకంగా 91 లక్షల గోల్డ్‌ కొట్టేసిన ఉద్యోగి

కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *