Headlines

Actor Nassar: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు.. ఆ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.. నాజర్..


సీనియర్ నటుడు నాజర్ తన సినీ ప్రస్థానాన్ని, తొలినాళ్ళ అనుభవాలను, పరిశ్రమలోని గొప్ప వ్యక్తుల అండదండలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. తన చిన్ననాటి నుండే సినిమా వాతావరణం తనకు పరిచయమని, కమల్ హాసన్ గారి ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’ కార్యాలయం తమ ఇంటికి కొన్ని భవనాల దూరంలో ఉండటం వల్ల ఇంటి వాతావరణం కూడా సినిమామయం అయ్యిందని ఆయన తెలిపారు. అప్పట్లో కమల్ హాసన్ ను కలుస్తానో లేదో తెలియని తాను, ఒకరోజు స్కూల్ లో ఉండగా, తన తండ్రి తనని ఎత్తుకుని, “నువ్వు హీరో మెటీరియల్ రా. ఇండస్ట్రీకి రా” అని చాలాసార్లు చెప్పేవారని నాజర్ గుర్తుచేసుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో చెన్నైకి వెళ్ళిన తర్వాత, మొదటి ఉద్యోగంలో చేరానని, అయితే సినిమా యాక్టింగ్ క్లాసులకు సరిపడా డబ్బులు ఉండేవి కావని నాజర్ వివరించారు.

ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అదనపు పనులు చేసుకుని, కొంచెం కొంచెం డబ్బు పోగేసుకుని యాక్టింగ్ క్లాసుల్లో చేరానని ఆయన తెలిపారు. పదిహేనేళ్ళ తర్వాత తాను యాక్టింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టానని, అప్పుడు తనకు చాలామంది స్నేహితులు సపోర్ట్ ఇచ్చారని, ఆదరించారని పేర్కొన్నారు. అలాంటి కీలక సమయంలో తాను చాలామంది ఇంట్లో భోజనం చేశానని, ముఖ్యంగా చిరంజీవి ఇంట్లో కూడా తిన్నానని నాజర్ వెల్లడించారు. అయితే, ఈ విషయం చిరంజీవి గారికి అస్సలు తెలియదని, ఆయన సతీమణి సురేఖ గారికి మాత్రమే తెలుసని ఆయన నవ్వుతూ చెప్పారు. చిరంజీవి సెట్స్‌లో ఉన్నప్పుడు, తనకు ఆకలి వేస్తే తన స్నేహితుడిని అడిగేవాడినని, వాడు సురేఖ గారికి ఫోన్ చేసి భోజనం ఉందో లేదో కనుక్కుని చెప్పాక తాను వెళ్లి భోజనం చేసి వచ్చేవాడినని నాజర్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో ఎవరూ తనను కించపరచలేదని, అది మన చిత్ర పరిశ్రమలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ అని ఆయన ప్రశంసించారు.

తన తొలి తెలుగు చిత్రం చంటి గురించి మాట్లాడుతూ, అప్పటివరకు తాను తెలుగు సినిమాలు చూడలేదని, తెలుగు భాష కూడా రాదని నాజర్ తెలిపారు. ఆ సినిమాలో అందరూ కోట శ్రీనివాసరావు వంటి పెద్ద నటులు ఉన్నారని, తన పాత్ర కూడా చాలా చిన్నదని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఆ చిత్రంలో, తనకు తెలుగు రాకపోయినా, కొత్త భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేదని నాజర్ చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన డైలాగ్ అర్థం కాకపోవడంతో వెంకటేష్ గారిని అడిగానని, ఆయన అంత పెద్ద స్టార్ అయినా తనకు అర్థమయ్యేలా వివరించారని నాజర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *