Headlines

సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ విషయాలు అస్సలు మిస్ అవ్వకండి!


మాధుర్యానికి పోషక విలువలు తోడయితే.. అది సీతాఫలం. విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని ‘ప్రకృతి ప్రసాదించిన వరం’ అని పిలుస్తారు. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. సీతాఫలంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. విటమిన్-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎముకలు, దంతాలకు దృఢత్వాన్ని చేకూరుస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది. రక్తహీనత నివారణకు, శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి, ఆహారాన్ని శక్తిగా మార్చే జీవక్రియలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ సీతాఫలం తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇందులో సహజ చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమితంగా మాత్రమే తినాలి. లేదంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఈ పండును అతిగా తింటే కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. అలర్జీ ఉన్నవారికి దురద, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా సీతాఫలం విత్తనాల్లో కంటికి హాని చేసే విషపూరిత సమ్మేళనాలు ఉంటాయి కాబట్టి విత్తనాలను తినకూడదు. ఈ పండును అలాగే నేరుగా తినవచ్చు లేదా హల్వా, కస్టర్డ్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లా తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!

స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌..

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా.. అల్వాల్‌ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

అయ్యప్పభక్తులకు తీపి కబురు.. మీ ఇంటికే నేరుగా ప్రసాదం

400 మార్కులకు 397తో భారీ స్కోర్‌.. టాపర్ బండారం బయటపడింది ఇలా!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *