Headlines

Mushroom Fry Recipe: సాయంత్రం స్నాక్‌గా వేడివేడిగా మష్రూమ్ ఫ్రై చేసుకోండి.. రుచి అదిరిపోతుంది!


మష్రూమ్స్‌తో కూరలు, పులావ్ మాత్రమే కాదు.. రుచికరమైన స్నాక్ కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, గరం మసాలా వంటి పదార్థాలతో చేసే ఈ ఫ్రైను పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినవచ్చు. మరి ఈ మష్రూమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు

  • మష్రూమ్స్ – 250 గ్రాములు

  • ఉల్లిపాయ – 1

  • పచ్చిమిర్చి – 2

  • జీలకర్ర – అర టీస్పూన్

  • పసుపు – పావు టీస్పూన్

  • మిరియాల పొడి – పావు టీస్పూన్

  • కారం – పావు టీస్పూన్

  • గరం మసాలా – అర టీస్పూన్

  • కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు

  • ఉప్పు – తగినంత

  • నూనె – సరిపడా

మష్రూమ్ ఫ్రై తయారీ విధానం

ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి స్వల్పంగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.

ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ను పాన్‌లో వేయాలి. వాటిని కలుపుతూ కొద్దిసేపు ఉడికించాలి. అనంతరం పసుపు, మిరియాల పొడి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

మష్రూమ్స్‌లోని నీరు ఆవిరయ్యే వరకు ఉడికించాలి

మష్రూమ్స్ ఉడికేటప్పుడు వాటిలోని నీరు బయటకు వస్తుంది. కాబట్టి ఆ నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మిశ్రమాన్ని ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మష్రూమ్స్ కొద్దిగా బంగారు రంగులోకి మారిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసి మరో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడి మష్రూమ్ ఫ్రై సిద్ధమైనట్లే.

మష్రూమ్ ఫ్రైని దేనితో తినవచ్చు?

ఈ మష్రూమ్ ఫ్రైను వేడివేడిగా పావ్ లేదా బ్రెడ్‌తో కలిపి తినవచ్చు. సాయంత్రం స్నాక్‌గా లేదా భోజనంలో సైడ్ డిష్‌గా కూడా వడ్డించుకోవచ్చు. కారం, మసాలాల రుచితో ఉండే ఈ వంటకం సాధారణ స్నాక్స్‌కు భిన్నంగా ఉంటుంది.

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *