Headlines

Telangana: పోలీస్ స్టేషన్‌కు ఊహించని అతిథి.. భయంతో వణికిపోయిన పోలీసులు.. చివరకు


Telangana: పోలీస్ స్టేషన్‌కు ఊహించని అతిథి.. భయంతో వణికిపోయిన పోలీసులు.. చివరకు

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఓ నాగుపాము పోలీస్ స్టేషన్‌లోకి దూరింది.. విధుల్లో బిజీగా ఉన్న పోలీసులకు ఒక్కసారిగా నాగుపాము కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. స్టేషన్‌లోకి ప్రవేశించిన నాగుపాము నేరుగా ఓ మూలకు చేరుకుని అక్కడే కదలకుండా ఉండిపోయింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

సాధారణంగా పోలీసులను చూసి అందరూ భయపడుతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. ఈసారి తమ ముందున్న నాగుపామును చూసి ఏం చేయాలో తెలియక భయంగా చూస్తూ ఉండిపోయారు. ఇక స్టేషన్ లో నాగుపాము హడలెత్తిస్తుండటంతో వెంటనే స్నేక్ క్యాచర్ అయిన రాజాపూర్ సర్పంచ్ రామకృష్ణకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ మూలన నక్కి ఉన్న నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.

అనంతరం దానిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లడంతో పోలీసులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా నేరాలు, నేరస్థులు, ఫిర్యాదులతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌లో నాగుపాము ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. నిందితులను విచారించే పోలీసులకు ఈసారి నాగుపామును చూసి నివ్వెరపోయారు. మొత్తానికి రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నాగరాజు ఖాకీలకు కాసేపు చుక్కలు చూపించాడు. నాగరాజుకు ఏ కష్టమొచ్చిందో ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వచ్చింది అనుకొని కాసేపు అక్కడున్న వారు నవ్వుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *