కొత్తగా కొన్న ఇంట్లో సరదాగా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవాలని తవ్వకాలు ప్రారంభించిన ఓ వ్యక్తికి ఊహించని విధంగా బంగారు నిధి దొరికింది. ఫ్రాన్స్‌లోని లియోన్ నగర సమీపంలో ఉన్న న్యూవిల్లే-సుర్-సాన్ పట్టణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం అక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేసిన యజమాని, ఇటీవల ఇంటి వెనుక భాగంలోని తోటలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టాడు. కొద్దిమేర భూమిని తవ్విన తర్వాత కార్మికులకు మట్టిలో పాతిపెట్టిన కొన్ని ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. అవేంటని బయటకు తీసి తెరిచి చూడగా, అందులో ఐదు పెద్ద బంగారు కడ్డీలతో పాటు వందల సంఖ్యలో బంగారు నాణేలు దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా అంత భారీ మొత్తంలో బంగారం కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఆ ఇంటి యజమాని ఏమాత్రం దురాశకు పోకుండా తన నిజాయతీని చాటుకున్నాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచకుండా వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని విలువ కట్టారు. దాని విలువ సుమారు 7 లక్షల యూరోలు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మున్సిపల్, పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ బంగారానికి ఏదైనా చారిత్రక ప్రాధాన్యత ఉందా అనే కోణంలో పరిశీలించగా, పురావస్తు విలువ కలిగిన ఆధారాలేవీ లేవని ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనల ప్రకారం పురావస్తు సంపద అయితే ప్రభుత్వపరమవుతుంది. ఈ నిధి అసలు ఎవరిది, భూమిలోకి ఎలా వచ్చిందనే పూర్తి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూ ఇయర్ గిఫ్ట్‌గా.. అల్వాల్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
అయ్యప్పభక్తులకు తీపి కబురు.. మీ ఇంటికే నేరుగా ప్రసాదం
400 మార్కులకు 397తో భారీ స్కోర్.. టాపర్ బండారం బయటపడింది ఇలా!
పులినే పరుగులు పెట్టించిన మంత్రి… ఆ తర్వాత!
కార్తీకమాసంలో.. భక్తులకు శుభవార్త.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు