Headlines

ఎవర్రా మీరు… సింహాన్నే హడలెత్తించారుగా


గుజరాత్‌లోని ధరి గిర్ తూర్పు డివిజన్‌లో ఉన్న అంబర్డీ సఫారీ పార్క్‌లో అటవీ సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఓ సింహాన్ని ముగ్గురు సిబ్బంది వేర్వేరు మోటార్‌సైకిళ్లపై వెంబడిస్తూ భయపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో అటవీ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన ముగ్గురు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వైరల్ అయిన వీడియోలో ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై సింహాన్ని చుట్టుముట్టి బహిరంగ ప్రదేశంలోకి తరిమే ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపించింది. వారిలో ఒకరి వద్ద వాకీ-టాకీ ఉండటం, సమీపంలోనే అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ బొలెరో వాహనం కనిపించడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీపావళి సెలవుల్లో పార్క్‌కు వచ్చిన వీఐపీ అతిథులకు సింహాన్ని దగ్గర నుంచి చూపించేందుకే సిబ్బంది ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది అన్ని వైపుల నుంచి వెంబడించడంతో ఆగ్రహానికి గురైన సింహం, ఒక దశలో వెనుదిరిగి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ జైపాల్ సింగ్ స్పందిస్తూ.. సాయంత్రం వేళ సింహాన్ని దాని ప్రత్యేక ఎన్‌క్లోజర్ వైపు మళ్లించే క్రమంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. సాధారణంగా జీపు ఉపయోగించి చేయాల్సిన ఈ పనిని సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లపై చేశారని, అందుకే నోటీసులు ఇచ్చి ముగ్గురిని తొలగించామని స్పష్టం చేశారు. మరోవైపు, ఇన్-ఛార్జ్ ఏసీఎఫ్ మాట్లాడుతూ.. సాయంత్రం 5 గంటలకు ఆహారం పెట్టే సమయానికి సింహం బయటకు వెళ్లడంతో తిరిగి లోపలికి పంపే ప్రయత్నం చేశారే తప్ప, వేధించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేజీ సన్నబియ్యం రూ.100.. అమలు కాని సర్కారు ధరలు !

అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. మకర విళక్కు యాత్రకు ప్రత్యేక రైళ్లు!

ఇక RAC లేదు? రైల్వే శాఖ సంచలన నిర్ణయం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *