Headlines

ఇక RAC లేదు? రైల్వే శాఖ సంచలన నిర్ణయం!


రైలు ప్రయాణం అంటేనే ఎంతో కొంత ఆందోళన.. అందులోనూ RAC టికెట్ వచ్చిందంటే చాలు, ఇక మన ప్రయాణం నరకమే అనుకోండి. ఫుల్ టికెట్ డబ్బులు కట్టాలి, కానీ కూర్చోవడానికి ఒకే సీటును ఇద్దరు పంచుకోవాలి. రాత్రి అయితే ఆ ఇబ్బంది వర్ణనాతీతం. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులను వేధిస్తున్న ఈ పాత పద్ధతికి చరమగీతం పాడటానికి ఇండియన్ రైల్వేస్ సిద్ధమవుతోందా? అంటే రైల్వే అధికారుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. దశాబ్దాలుగా ఇండియన్ రైల్వేస్‌లో అమలవుతున్న ‘రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సలేషన్’ అనగా RAC సిస్టమ్‌ను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతే. ఫుల్ ఫేర్ వసూలు చేసి, సగం సీటు మాత్రమే కేటాయించడం ఎంతవరకు న్యాయం అని ఇటీవల ఒక పార్లమెంటరీ కమిటీ కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయంగా రైల్వే బోర్డు ఈ నిబంధనపై పునరాలోచనలో పడింది. ఇక అసలు ట్విస్ట్ ఏమిటంటే.. రాబోయే అత్యాధునిక ‘వందే భారత్ స్లీపర్ ట్రైన్స్’ లో ఈ RAC బెర్త్ లొల్లికి పూర్తిగా చెక్ పెట్టేశారు. ఈ ప్రీమియం లాంగ్-డిస్టెన్స్ రైళ్లలో ఇకపై ఎలాంటి RAC ప్రొవిజన్ ఉండదు. టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఎలాంటి షేరింగ్ బెర్త్ లేకుండా.. పూర్తి స్థాయి వ్యక్తిగత బెర్త్ మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. అంటే వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై బెర్త్‌ కోసం ఎదురుచూపులు ఉండవన్నమాట. అయితే, ఈ నిర్ణయం కనుక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైళ్లకు వర్తింపజేస్తే.. వెయిటింగ్ జాబితా ప్రయాణికులకు టికెట్లు దొరకడం మరింత కష్టమయే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. మరి రైల్వే శాఖ RAC ని పూర్తిగా రద్దు చేస్తుందా? లేక ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా సగం చార్జీల విధానాన్ని తీసుకువస్తుందా? దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: కొనసాగుతున్న పసిడి పతనం..ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే!

హైదరాబాద్‌లో ముసుగు దొంగల సంచారం..

బ్యాటింగ్ వైఫల్యాలపై గంభీర్, రవిశాస్త్రి సీరియస్!

అయ్యో.. పచ్చబొట్టు ఎంత పనిచేసింది!

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *