మెగాస్టార్ చిరంజీవి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఓ వైపు రికార్డులను బద్దలు కొడుతూ.. మరోవైపు తన స్పీచ్ లతో కూడా ట్రెండింగ్ గా నిలుస్తున్నారు. సాధారణంగా చిరు ఏ వేదికపై మాట్లాడినా తనదైన శైలిలో సభా గౌరవాన్ని కాపాడుతూనే ఛలోక్తులతో అందరిలో నవ్వులు పూయిస్తారు. లేటెస్ట్గా హైదరాబాద్ వేదికగా జరిగిన “ఇట్లు అర్జున” సక్సెస్ వేడుకలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వెంకీ కుడుములపై చిరంజీవి కామెడీగా చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
చిరు ఏమన్నారంటే..
చిరంజీవి – వెంకీ కుడుముల కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే పలు కారణాల రీత్యా ఆ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ.. వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. సాధారణంగా తాను ఏ దర్శకుడినీ నాతో సినిమా చేయమని అడగలేదని.. కానీ కేవలం వెంకీ కుడుములను మాత్రమే స్వయంగా పిలిచి సినిమా చేయమని అడిగానని మెగాస్టార్ తెలిపారు. అయితే ఒక మంచి కథతో వస్తానని మాట ఇచ్చిన వెంకీ.. ఇప్పటివరకు రాలేదని.. తాను మాత్రం ‘చకోర పక్షిలా’ ఎదురుచూస్తూనే ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ఇకపై వెంకీ వచ్చినా తన ఇంటి గేట్లు మూసే ఉంటాయని నవ్వుతూ అనడంతో వేడుకలోని వారంతా కూడా కాసేపు నవ్వుకున్నారు.
వెంకీ రియాక్షన్..
ఇక ఇదే విషయాన్ని వెంకీ కుడుముల గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ‘భీష్మ’ తర్వాత మెగాస్టార్ కోసం ఒక కామెడీ ఎంటర్టైనర్ను సిద్ధం చేసినట్టు చెప్పుకొచ్చారు. సుమారు 18 – 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఒక రాయలసీమ మాజీ ఫ్యాక్షనిస్ట్.. ప్రస్తుతం ఉన్న ఈ అప్డేటెడ్ ప్రపంచంలో ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్‌తో కథను రాశానన్నారు. అయితే ఫస్ట్ హాఫ్ వచ్చినంత అద్భుతంగా సెకండాఫ్ కుదరలేదని.. అందుకే ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టానని తెలిపారు. కానీ చిరంజీవి మాత్రం.. నిరుత్సాహపడొద్దని చెప్పారని.. ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారని ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో నటిస్తున్న మూవీ ‘కాకా’. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో పలు పరాజయాలను మూటగట్టుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ముఖ్యపాత్రలో నటిస్తుంది. మరోవైపు చిరు – వశిష్ట కాంబినేషన్ లో “విశ్వంభర” మూవీ సైతం తెరకెక్కుతుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా చేస్తుండగా.. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం రాబోతుంది.
హిట్ కొడతాం..
Definitely కొడతాం 😎🔥
That’s the statement from our #KAAKA Megastar @KChiruTweets garu 💥
JAN 13th Sankranthi 2027❤️🔥
#KAAKAOnJan13 https://t.co/iREEOcE75Z
— Kaaka (@KaakaMovie) November 17, 2026