Headlines

కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!


కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎలా చేయాలి?..
ఈ పవిత్రమైన రోజున ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో దీపదానం చేసుకోవచ్చు. ముందుగా ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
మట్టి ప్రమిదలను తీసుకుని వాటిలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వత్తులు వేయాలి.
పూజా మందిరంలో విష్ణుమూర్తి, పరమశివుడు, లక్ష్మీదేవికి పూలు, ధూపదీపాలతో పూజ చేయాలి. అనంతరం ఇంటి ప్రధాన ద్వారం, పూజగది, తులసి కోట దగ్గర దీపాలను వెలిగించాలి. వీలైతే సమీపంలోని ఆలయానికి వెళ్లి దీపదానం చేయాలి. నదీ తీరాల్లో దీపాలు సమర్పించేటప్పుడు స్థానిక సంప్రదాయాలను పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం భగవంతుడిని ప్రార్థించాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం మంచిదిగా భావిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *