ఒక పాన్‌లో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, పిండిన కాకరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మంటను లో నుండి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, ఒక టీ స్పూన్ పసుపు కలపాలి. ముక్కలు పూర్తిగా వేగి, కరకరలాడే వరకు సుమారు 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైకి మాడి లోపల పచ్చిగా ఉంటాయి, కాబట్టి ఓపికగా లో-మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. కాకరకాయలు వేగేలోపు, ఒక మిక్సీ జార్‌లో ఒక పూర్తి వెల్లుల్లి పాయ, రెండు టీ స్పూన్ల జీలకర్ర, 50 గ్రాముల కొబ్బరి తురుము తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి.