Headlines

ఆ ఒక్క హీరోతోనే ఏకంగా 40 సినిమాలు.. ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట


దక్షిణాది సినీ చరిత్రలో తనదైన గ్లామర్, అభినయంతో అజరామర కీర్తిని పొందిన దివంగత నటి జయంతి జీవితం అనేక ఒడిదుడుకులకు, విజయాలకు నిదర్శనం. అప్పట్లో తెరపై స్కర్ట్స్, టీ-షర్ట్స్, నైటీలు, స్విమ్‌సూట్లు ధరించి గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన ఆమె, కన్నడ చిత్రసీమలో అభినయ శారదగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. జయంతి అసలు పేరు కమలకుమారి. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి ముగ్గురు పిల్లలతో మద్రాస్‌కు మకాం మార్చారు. ఈ పరిస్థితి జయంతి బాల్యాన్ని కష్టతరం చేసింది. డాన్స్ పట్ల ఆసక్తి ఉన్న జయంతిని ఆమె తల్లి చంద్రకళా నాటక విద్యాలయంలో చేర్పించారు, అక్కడ ప్రముఖ నటి మనోరమతో స్నేహం ఏర్పడింది. సినిమాల పట్ల ఆసక్తితో ప్రయత్నాలు మొదలుపెట్టినా, ప్రారంభంలో బొద్దుగా ఉండటం, డాన్స్ అంతగా చేయలేకపోవడం వల్ల అవకాశాలు దక్కలేదు. అయితే, హీరోయిన్ కావాలనే సంకల్పాన్ని వదలక, బరువు తగ్గి, డాన్స్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. 1961లో వాహిని స్టూడియోస్‌లో జగదేకవీరుని కథ షూటింగ్ చూస్తున్నప్పుడు దర్శకుడు కె.వి. రెడ్డి ఆమెను చూసి ప్రోత్సహించారు. జ్వరం ఉన్నప్పటికీ, కె.వి. రెడ్డి గారి పర్యవేక్షణలో ఆమె ఆ సినిమాలో వరుణమాత పాత్రను సమర్థవంతంగా పోషించారు. కె.వి. రెడ్డిని తన కన్నబిడ్డలా చూసుకున్నారని జయంతి తరుచూ గుర్తుచేసుకునేవారు.

అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా

ఆమెకు తొలి హీరోయిన్ అవకాశం కన్నడ చిత్రం జేను గూడు (1962)తో లభించింది, ఈ సినిమాతోనే ఆమె కమలకుమారి నుండి జయంతిగా మారారు.  ఆతర్వాత  500కు పైగా చిత్రాల్లో నటించిన జయంతి,  డాక్టర్ రాజ్‌కుమార్‌తో 40కి పైగా చిత్రాల్లో నటించి, కన్నడ సినీ చరిత్రలో రికార్డు సృష్టించారు. 1965లో మిస్ లీలావతి చిత్రంలో కట్స్, టీ-షర్ట్స్, నైటీలు, స్విమ్‌సూట్లు ధరించి గ్లామర్ డాల్‌గా కనిపించిన తొలి కన్నడ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలతో జగదేకవీరుని కథ, కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, భార్యాభర్తలు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, పెదరాయుడు వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తమిళంలో జెమినీ గణేశన్, ఎంజీఆర్, నగేష్, జయశంకర్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. దర్శకుడు కె. బాలచందర్‌తో ఆమెకు మంచి అనుబంధం ఉండేది.

నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!

తెలుగు అమ్మాయి అయినా తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కమెడియన్ పేకేటి శివరామ్‌ను వివాహం చేసుకున్న జయంతికి కృష్ణకుమార్ అనే కుమారుడు ఉన్నాడు. పేకేటి శివరామ్ ఇప్పటికే వివాహితుడు కావడంతో, వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె కోడలు అను ప్రభాకర్ కన్నడలో ప్రసిద్ధ నటి. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత సెకండ్ హీరోయిన్‌గా, తల్లి, వదిన వంటి క్యారెక్టర్ రోల్స్‌లో కొనసాగారు. నిర్మాతగా కూడా ప్రయత్నించి నష్టాలను చవిచూశారు. రాజకీయాల్లోనూ ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు.35 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతూ, 2021 జులై 26న 76 సంవత్సరాల వయసులో బెంగళూరులోని తన నివాసంలో జయంతి తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి



సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు

Jayanthi

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *