Headlines

సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు


తెలుగు సినీ చరిత్రలో జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ఒక అద్భుతమైన ప్రభంజనంగా నిలిచింది. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, హీరో చిరంజీవిల కెరీర్‌లో ఇది ఒక మైలురాయి. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో నటి శ్రీదేవి కొన్ని షరతులు విధించి, నిర్మాతలకు, హీరో చిరంజీవికి కొంత ఇబ్బంది కలిగించారని జర్నలిస్ట్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆనాటి విశేషాలను విశ్లేషిస్తూ, ఈ సినిమా విజయ రహస్యాలలో తెరవెనుక జరిగిన సంఘటనల ఇప్పుడు వైరల్ అవుతుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి నాటికి శ్రీదేవి ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయిక. ఆమె బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ స్థాయికి చేరుకున్న తర్వాత, తన పాత్రకు, తన ప్రెజెన్స్‌కు ప్రాధాన్యత విషయంలో ఆమె రాజీపడలేదు. గతంలో కూడా చిరంజీవితో కొండవీటి దొంగ చిత్రానికి కొండవీటి రాణి అని టైటిల్ మార్చమని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. ఆ సినిమాలో కథానాయికి పాత్రను విజయశాంతి, రాధలకు రెండు పాత్రలుగా విభజించాల్సి వచ్చింది.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం విషయానికి వస్తే, నిర్మాత అశ్వనీదత్ మొదట జగదేకవీరుడు అనే టైటిల్‌ను మాత్రమే అనుకున్నారు. చిరంజీవి డేట్లు లభించడం కష్టంగా ఉండటంతో, ఆయనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ టైటిల్ పెట్టాలన్నది అశ్వనీదత్ ఆలోచన. అయితే శ్రీదేవి, ఆమె తల్లి రాజేశ్వరి, తమ పాత్ర అతిలోకసుందరికి కూడా టైటిల్‌లో సమాన ప్రాధాన్యత ఉండాలని గట్టిగా పట్టుబట్టారట. డబ్బింగ్ చెప్పడానికి కూడా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయాలని షరతు విధించారట. డబ్బింగ్ చెప్పకుండా ఆమె లమ్హే అనే హిందీ సినిమాకు మూడు నెలలు డేట్స్ ఇచ్చేయడంతో, నిర్మాత అశ్వనీదత్‌కు తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. చిరంజీవిగారితో చర్చించి, టైటిల్‌ను జగదేకవీరుడు అతిలోకసుందరిగా ఖరారు చేశారట. ఈ సందర్భంగా టైటిల్ లోగోలో అతిలోకసుందరి పదం ముందుకు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారట.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

శ్రీదేవి చాలా కమిట్‌మెంట్‌తో, పర్టిక్యులర్‌గా ఉండే నటి. కాస్ట్యూమ్స్, డైలాగ్స్, డిక్షన్, డ్యాన్స్ రిహార్సల్స్ విషయంలో ఆమె ఎంతో కచ్చితంగా ఉండేవారు. ఆమె చెప్పిన సమయానికి సెట్‌కు వచ్చి, తన షూటింగ్ షాట్స్ పూర్తి చేసేవారు. అయితే ఆమె డిమాండ్స్ ఉన్నప్పటికీ, చిరంజీవి ఆమెను ఒక గొప్ప నటిగా గౌరవించారు. ఒకప్పటి విలన్ పాత్రల నుండి మెగాస్టార్‌గా ఎదిగిన తన ప్రతిభను శ్రీదేవి గుర్తించినట్లు, ఇద్దరూ సమ ఉజ్జీల మధ్య పోటాపోటీగా నటించినట్లు శ్రీకాంత్ వివరించారు. సినిమా క్లైమాక్స్‌లో ఐ లవ్ యూ చెప్పే సన్నివేశంలో శ్రీదేవి కేవలం లిప్ మూమెంట్ మాత్రమే ఇచ్చి, ఆ డైలాగ్‌ను చెప్పకుండా నేపథ్య సంగీతంతో కవర్ చేయించారని, ఇలాంటి విచిత్రమైన షరతులు శ్రీదేవి పెట్టేవారని జర్నలిస్ట్ శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి



ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *