Headlines

విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్


ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సెమిస్టర్లు, ఇంటర్న్‌షిప్‌లు, పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు ‘స్టూడెంట్ ఫేర్’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద టికెట్ బేస్ ఫేర్‌పై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా, సాధారణంగా ఇచ్చే 15 కేజీల లగేజీకి అదనంగా మరో 10 కేజీలు చేర్చి, మొత్తం 25 కేజీల చెక్-ఇన్ బ్యాగేజీని ఉచితంగా అనుమతిస్తున్నారు. ఈ ఆఫర్ అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ప్రయాణ తేదీని మార్చుకోవాల్సి వస్తే కేవలం రూ. 99 చెల్లిస్తే సరిపోతుంది. ‘VIBES’ ప్రోమో కోడ్‌తో అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, వీసా కార్డు ద్వారా చెల్లింపులు చేసి ‘VISAFLY’ కోడ్ ఉపయోగిస్తే అక్టోబర్ 9 వరకు రూ. 600 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు ఈ రాయితీలకు అర్హులు. బుకింగ్ సమయంలో ‘స్టూడెంట్ ఫేర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. విమానాశ్రయంలో చెక్-ఇన్ చేసేటప్పుడు పుట్టిన తేదీతో కూడిన చెల్లుబాటు అయ్యే విద్యార్థి ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌

The Paradise: నాని ‘ప్యారడైజ్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *