Headlines

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!


దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. నగదు ఉపసంహరణ నిబంధనలలో కీలక మార్పులు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా బ్రాంచుల ద్వారా తెరిచిన ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ ఖాతాదారులకు వర్తిస్తాయి. BSBD ఖాతాదారులు ఏటీఎం నుంచి లేదా బ్యాంక్‌ బ్రాంచ్‌ నుంచి నెలకు గరిష్టంగా 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 4 లావాదేవీలు పూర్తయిన తర్వాత చేసే ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ. 15 తో పాటు, జీఎస్టీ ఛార్జీగా వసూలు చేస్తారు. గతంలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చేసే నగదు ఉపసంహరణలను ఉచిత డిజిటల్ లావాదేవీలుగా పరిగణించేవారు. కానీ అక్టోబర్ 1 నుంచి ఇవి కూడా నెలవారీ 4 ఉచిత విత్‌డ్రాల పరిమితి పరిధిలోకి వస్తాయి. ఇక ఈ మార్పులు కేవలం భౌతిక నగదు ఉపసంహరణలకు మాత్రమే పరిమితం. యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై ఎటువంటి పరిమితి లేదా అదనపు ఛార్జీలు ఉండవు. వినియోగదారులు మునుపటిలాగే ఉచితంగా ఎన్ని డిజిటల్ లావాదేవీలైనా చేసుకోవచ్చు. మరోవైపు ఎస్‌బీఐ ఆగస్టు 15 నుంచే రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కాగా, నవంబర్ ఉచిత పరిమితుల కంటే ముందుగానే ఆర్థికంగా బలపడిన ఎస్‌బీఐ, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకంగా రూ.21,121 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాబట్టి ఎస్‌బీఐ ఖాతాదారులు అక్టోబర్ 1 నుంచి నగదు ఉపసంహరణల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌

The Paradise: నాని ‘ప్యారడైజ్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *