న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు నెగెటివ్ రివ్యులూ కూడా ఇచ్చారు. అయితే వీటన్నిటినీ అధిగమించి మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ది ప్యారడైజ్. రెండో రోజు కాస్తా జోరు తగ్గినా వీకెండ్ లో నాని సినిమా మళ్లీ దుమ్మురేపింది. శనివారం (సెప్టెంబర్ 26) నాని సినిమాకు 20 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషం. ఈ లెక్కన మొత్తం మూడు రోజులకు కలిపి ది ప్యారడైజ్ సినిమా ఓవరాల్ గా రూ. 136 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ది ప్యారడైజ్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న నాని ది ప్యారడైజ్ సినిమాతో రికార్డులు కొల్లగొడుతున్నాడు. మూడు రోజుల్లో నాని సినిమా 1.85 మిలియన్ డాలర్లు (17.72 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
కాగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ సినిమాలో జడల్ పాత్రలో నాని అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ కయాదు లోహర్ సుబ్బు పాత్రలో చాలా క్యూట్ గా కనిపించింది. ఇక కరడుగట్టిన విలన్ శికంజా మాలిక్ పాత్రలో మోహన్ బాబు ఆడియెన్స్ ను భయపెట్టాడు. వీరితో పాటు రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.
ఇవి కూడా చదవండి
మూడు రోజుల్లో 136 కోట్ల కలెక్షన్లు..
It is JADAL ZAMANA at the box office 🔥🔥#TheParadise collects 136 CRORES+ GROSS WORLDWIDE in 3 days ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/XTkG9ueWdvNatural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼@themohanbabu @11Lohar… pic.twitter.com/6H0IKnAmxf— SLV Cinemas (@SLVCinemasOffl) September 27, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి