నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘దసరా’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఈ రా యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన క్రేజీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘ప్యారడైజ్’ డిజిటల్ రైట్స్ కోసం తీవ్రమైన పోటీ నడిచింది. చివరికి నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల స్ట్రీమింగ్ హక్కులు కూడా నెట్‌ఫ్లిక్స్ వశమయ్యాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు పాటించే నిబంధనల ప్రకారమే, థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాల తర్వాతే ఈ ఓటీటీలోకి రానుంది. దీన్నిబట్టి దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20 నుండి 22 తేదీల మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ప్యారడైజ్’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శక్తివంతమైన విలన్ పాత్రలో, సోనాలి కులకర్ణి కీలక పాత్రలో మెరిశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmi Gautam: ‘నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
Srikanth Odela: ‘ప్యారడైజ్’ టాక్‌తో చిరు-శ్రీకాంత్ మూవీకి బ్రేక్ పడుతుందా?
Hanuman Ansh: 400 కోట్ల వైపు పరుగులు.. 2 కోట్ల చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
The Paradise: నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్