Headlines

IND vs WI: భారత్‌తో తొలి వన్డే.. విండీస్ కెప్టెన్ మాటల్లో నిజమెంత? రికార్డులు ఏం చెబుతున్నాయి?


IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా జరగనుంది. ప్రపంచ నంబర్-1 వన్డే జట్టుగా ఉన్న టీమిండియాతో వారి సొంతగడ్డపై తలపడటం ఎంత కష్టమో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్వయంగా అంగీకరించారు. భారత్‌ను భారత్‌లోనే ఓడించడం ఏ జట్టుకైనా సవాల్‌తో కూడుకున్న పనేనని, అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్‌కు ముందే షాయ్ హోప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

విండీస్ జట్టు ఘోరమైన రికార్డులు

షాయ్ హోప్ ఆత్మవిశ్వాసంతో మాట్లాడినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్ జట్టు ప్రదర్శన మాత్రం చాలా పేలవంగా ఉంది. 2025 నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 22 వన్డే మ్యాచ్‌లలో కేవలం 6 మ్యాచ్‌లలో మాత్రమే విజయాలు సాధించగలిగింది. ఇక 2026 సంవత్సరంలో కరీబియన్ జట్టు కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. అంతేకాకుండా గతంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. 2019 నుంచి ఇప్పటివరకు విండీస్ జట్టు భారత్‌ను వన్డేల్లో కేవలం రెండే సార్లు ఓడించగలిగింది. ఈ గణాంకాలు విండీస్ జట్టు ప్రస్తుత దుస్థితిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

షాయ్ హోప్ అద్భుతమైన రికార్డు

జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌కు మాత్రం భారత పిచ్‌లపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. భారత్‌లో తాను ఆడిన 14 వన్డే ఇన్నింగ్స్‌లలో హోప్ ఏకంగా 74.10 సగటుతో 741 పరుగులు సాధించారు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. భారత్‌లో తన తొలి రోజులను గుర్తుచేసుకున్న హోప్, భారతీయ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో సవాల్‌తో కూడుకున్న అనుభవమని, ఇక్కడ రాణించడం ద్వారానే ఒక ఆటగాడి అసలైన సత్తా ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

తొలి వన్డేలో హోరు ఉత్కంఠ

ఒకవైపు పటిడమైన భారత్ జట్టు, మరోవైపు ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్న వెస్టిండీస్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు బరిలో దిగుతుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. షాయ్ హోప్ తన వ్యక్తిగత ఫామ్‌ను కొనసాగించి జట్టును విజయపథంలో నడిపిస్తారా లేదా అనేది నేటి మ్యాచ్‌తో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *