Headlines

Bigg Boss 10: బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్.. రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో కంటెస్టెంట్లకు షాక్.. మిథిలేష్ సంచలన నిర్ణయం!


శనివారం రోజు నాగార్జున హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. రోహిత్ కు కూడా గట్టిగానే ఇచ్చిపడేశారు. ప్రతి విషయంలో మధ్యలోకి వెళ్లకుండా, ఏదైనా సమస్య ఉంటే సంబంధిత వ్యక్తికి నేరుగా చెప్పాలని రోహిత్‌కు నాగార్జున సూచించారు. ముఖేష్, రోహిత్ మధ్య జరిగిన ఆటను కూడా పరిశీలించిన నాగార్జున.. ఎల్లో లైన్ క్రాస్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. సంచాలకుడిగా అమన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పారు. చరణ్ విషయంలోనూ నాగార్జున ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏదో చేయబోతున్నట్టుగా కనిపిస్తున్నావు కానీ గేమ్‌లో ఆ ప్రభావం కనిపించడం లేదని చెప్పారు. ముఖేష్‌కు స్టార్ రావాలా వద్దా అనే అంశం కంటే.. తనకు వచ్చిన రెండో అవకాశాన్ని చరణ్ ఎలా ఉపయోగించుకుంటున్నాడో చూసుకోవాలని సూచించారు. వంశీకి కేవలం అరవడం మాత్రమే కాకుండా ఆటలో కూడా యాక్టివ్‌గా ఉండాలని నాగార్జున సూచించారు.

ఒక్క వివాదం.. దెబ్బకు కెరీర్ కొలాప్స్..! పెళ్ళైన హీరోతో యవ్వారం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్

కెప్టెన్‌గా ఝాన్సీ బాగా పనిచేసిందని ప్రశంసించిన నాగ్.. అయితే హౌస్‌లోని పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అందరినీ నడిపించాలని చెప్పారు. శ్రిష్టి గురించి రోహిత్ దగ్గర షాలినీ మాట్లాడిన విషయం కూడా నాగార్జున ప్రస్తావించారు. అపూర్వ చెప్పినట్టుగానే ఆ విషయాలు బయటకు రావడంతో షాలినీకి క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే వెనక మాట్లాడటం కంటే సంబంధిత వ్యక్తి ముందే చెప్పాలని సూచించారు నాగ్. అదే సమయంలో త్రిగుణ్‌ను కూడా ప్రశ్నించారు. ఝాన్సీ, అమన్, ముఖేష్ విషయంలో నేరుగా మాట్లాడకుండా ఎందుకు వెనక్కి తగ్గావని అడిగారు. తనకు ఏదైనా అనిపిస్తే ఎప్పటిలాగే మొహం మీదే చెప్పాలని సూచించారు.

OTT: ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే గతి.. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది

ఆ తర్వాత షాలినీ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనంతరం ఆమె తల్లిదండ్రుల ఫొటోలను పంపడంతో షాలినీ ఎమోషనల్ అయ్యింది. ఈ సన్నివేశం ఎపిసోడ్‌లో ఎమోషనల్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ ఎపిసోడ్‌లో సినిమా ప్రమోషన్స్ కూడా జరిగాయి. ‘సిగ్మా’ ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్, సందీప్ కిషన్ బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. ట్రైలర్‌ను హౌస్‌మేట్స్‌కు చూపించారు. త్రిగుణ్‌తో సందీప్ కిషన్ సరదాగా మాట్లాడటం, ‘త్రిగుణదూత’ అంటూ కామెంట్ చేయడం హౌస్‌లో నవ్వులు పూయించింది. ఇక ఎపిసోడ్ చివర్లో అసలు ట్విస్ట్ మొదలైంది. నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి ఓ బ్రీఫ్‌కేస్ పంపించారు. అందులో రూ.5 లక్షలు ఉన్నాయని, ఎవరైనా ఈ డబ్బులు తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్లవచ్చని ప్రకటించారు. ఊహించని ఆఫర్ కావడంతో కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచారు. అయినప్పటికీ కంటెస్టెంట్లు వెనక్కి తగ్గలేదు. చివరికి ఆఫర్‌ను ఏకంగా రూ.15 లక్షలకు పెంచారు. ఇక్కడే మిథిలేష్ ముందుకు వచ్చాడు. రూ.15 లక్షల ఆఫర్‌ను తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు మిథిలేష్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినా మిథిలేష్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు అతడిని పంపించాలా.? వద్దా.? అనే అంశంపై హౌస్‌మేట్స్ ఓటింగ్ నిర్వహించారు. దీంతో రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో మిథిలేష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. మిథిలేష్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆదివారం ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *