Headlines

Andhra Pradesh: అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్. అకౌంట్లోకి ఆ రోజే.. ప్రభుత్వం క్లారిటీ..!


ఏపీలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపనుంది. త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సద్దమవుతోంది. ఈ పథకం ద్వారా కూటమి సర్కార్ ప్రతీ ఏడాది రూ.20 వేలు రైతులకు ఆర్ధిక సాయం రూపంలో అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత నగదును జూన్ 20వ తేదీన రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయగా.. ఇప్పుడు రెండో విడత నగదు విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు నగదు పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. దసరా పండుగ కానుక అక్టోబర్ 17వ తేదీన నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ వస్తుండటంతో రైతుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు పండక్కి ముందే జమ చేయాలని భావిస్తోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నిధులను విడుదల చేయాలని భావించినప్పటికీ.. దసరాకు విడుదల చేస్తే మంచిదనే నిర్ణయానికి తాజాగా వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం ఏడాదికి రైతులకు రూ.6 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు అందిస్తోంది. మొత్తం ఏపీలోని రైతులకు రూ.20 వేలు ప్రతీ ఏడాది అందుతున్నాయి. వీటిని మూడు విడతలుగా జమ చేస్తున్నారు. తొలి విడత పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కలిపి రూ.7 వేలు అందగా.. రెండో విడతలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు రూ.2 వేలు విడిగా జమ కానుండగా.. అన్నదాత సుఖీభవ రూ.4 వేలు జమ అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను జమ చేసే రోజే సీఎం చంద్రబాబు కూడా విడుదల చేస్తున్నారు. దీంతో రైతుల ఒకేరోజు రెండు పథకాల నగదు అందుకుంటారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాయాన్ని రూ.20 వేలకు పెంచింది. ఈ సారి వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నివో ప్రభావం వల్ల రైతులు తీవ్ర నష్టపోయారు. నీటి సరఫరా లేకపోవడం, వర్షాలు పడకపోవడంతో పంటలు వేయలేదు. దీంతో రైతులకు ఆదాయం లేకుండా పోతుంది. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే సాయం రైతులకు ఆర్ధిక అవసరాల కోసం ఉపయోగపడనుంది. దీంతో ఈ నగదు ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *