Headlines

IRCTC: అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీ!


IRCTC Godavari Temple Tour Telugu: గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది మంచి ప్యాకేజీ. ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ‘ద్రాక్షారామం’ అనే పేరు దక్ష ప్రజాపతి పేరుతో ముడిపడి ఉందని పురాణ విశ్వాసం. ఈ క్షేత్రంతో పాటు అన్నవరం, అంతర్వేది, ఐనవిల్లి వంటి ప్రముఖ ఆలయాలను కూడా ఈ యాత్రలో దర్శించుకోవచ్చు.

గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీని SHR029 పేరుతో అందిస్తున్నారు. యాత్రలో రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నాయి. రైలు ప్రయాణంతో పాటు స్థానికంగా ఏసీ వాహనంలో ఆలయాల సందర్శన ఉంటుంది. ప్రతి శుక్రవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8:30 గంటలకు బయలుదేరే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభమవుతుంది.

మొదటి రోజు రాత్రి రైలు ప్రయాణం అనంతరం శనివారం తెల్లవారుజామున 4:38 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెష్‌అప్ అనంతరం అన్నవరం సత్యదేవుని దర్శనం ఉంటుంది. సాయంత్రం రాజమండ్రికి తిరిగి వచ్చి గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఇవి కూడా చదవండి



మూడో రోజు అంతర్వేదికి బయలుదేరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, బీచ్‌ను సందర్శిస్తారు. అనంతరం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయం, ఐనవిల్లి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం ద్రాక్షారామం చేరుకుని శ్రీ భీమేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్, ఆ తర్వాత లింగంపల్లికి చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

1 నుంచి 3 మంది ప్రయాణికులకు 3AC కంఫర్ట్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్‌కు రూ.15,400, ట్విన్ షేరింగ్‌కు రూ.8,990, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,230 నుంచి ఉంది. స్లీపర్ క్లాస్ స్టాండర్డ్ ప్యాకేజీ రూ.13,840 నుంచి ప్రారంభమవుతుంది. పిల్లలకు కూడా ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయి. 4 నుంచి 6 మంది ప్రయాణికులకు ధరలు మరింత తక్కువగా ఉంటాయి.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, రాజమండ్రిలో వసతి, ఏసీ వాహనం, దర్శనాలు, టోల్, పార్కింగ్, జీఎస్టీ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రైల్లో ఆహారం, ఆలయ ప్రవేశ టికెట్లు, బోటింగ్ వంటి అదనపు ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. రాజమండ్రిలో విష్ణు గ్రాండ్ లేదా సమాన స్థాయి హోటల్‌లో వసతి కల్పిస్తారు.

టికెట్లు సాధారణంగా ప్రయాణానికి నాలుగు రోజుల ముందు జారీ చేస్తారు. బెర్త్ కేటాయింపు సెంట్రలైజ్డ్ PRS ద్వారా జరుగుతుంది. హోటల్ చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలు; ముందస్తు చెక్-ఇన్ గదుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్యాకేజీ ధరలు, రైలు సమయాలు, హోటల్, యాత్ర షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు. బుకింగ్‌కు ముందు సంబంధిత టూర్ ఆపరేటర్ నుంచి తాజా వివరాలను నిర్ధారించుకోండి.

ఐఆర్‌సీటీసీ టెంపుల్ టూర్ ప్యాకేజీ బుకింగ్, మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *