అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలతో బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, యూఎస్ డాలర్ కదలికలు, ట్రెజరీ ఈల్డ్స్, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు వంటి అంశాలు పసిడి ధరలపై విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి. డాలర్ సూచీ బలపడినప్పుడు ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు గోల్డ్ ఖరీదైనదిగా మారి డిమాండ్‌పై ఒత్తిడి పెరుగుతుంది.దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సెప్టెంబరు 23 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870 పెరిగి, రూ.1,54,200 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 లు పెరిగి రూ.1,41,350 లు పలుకుతోంది. ఇక వెండి ధర రూ.2,55,000 తో స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబరు 23 బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,500 పలుకుతోంది. ముంబై, చెన్నై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,200 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,350 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి ధర రూ.2,55,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్ చేసుకొని వెళితే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!
కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!