Headlines

Actor Nani : మేము అర్థం చేసుకుంటున్నాము.. సీఎం, డీజీపీల సూచనలతో నాని కీలక నిర్ణయం..


ది ప్యారడైజ్ ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులతో కలిసి సినిమా చూస్తాను అంటూ రిక్వెస్ట్ చేసిన హీరో నానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పందించారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వడంపై హీరో నాని ధన్యవాదాలు తెలిపారు. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పోలీసు శాఖపై ఎలాంటి అదనపు భారం మోపాలని తాము కోరుకోవడం లేదని నాని స్పష్టం చేశారు. పోలీసు శాఖ తీసుకున్న తుది నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని.. అందుకే తాము అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్ సందర్శనను రద్దు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా నాని ట్వీట్ చేస్తూ.. ” ముఖ్యంగా గణేశ నిమజ్జన ఏర్పాట్ల విషయంలో ప్రజల భద్రతకు ఉన్న ప్రాముఖ్యతను మేము పూర్తిగా అర్థం చేసుకున్నాము. పోలీసు శాఖపై అదనపు భారం వేయడం గానీ, ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించడం గానీ మాకు ఇష్టం లేదు. పోలీసు శాఖ తీసుకునే తుది నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. దానికి కట్టుబడి ఉంటాము. భద్రత లేదా జనసందోహ నియంత్రణ పరంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే, ఆ పరిస్థితిని మేము పూర్తిగా అర్థం చేసుకుని, మా పర్యటనను విరమించుకోవడానికి సంతోషంగా అంగీకరిస్తాము. మీ సానుకూల స్పందనకు , సూచనలకు మరోసారి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు నాని.

నాని ట్వీట్..

సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్.. “తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు, కళాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమాను వీక్షించాలన్న నటుడు నాని గారి ఆకాంక్ష అభినందనీయం. అలాగే మన తెలంగాణకు చెందిన ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నాని గారు చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. అయితే అదే సమయంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత , ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు. నిబంధనలను పాటిస్తామంటూ నాని గారు భద్రత పట్ల చూపిన బాధ్యతను స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, ఈ పర్యటనకు సంబంధించి చిత్ర బృందం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రజలకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు విభాగం తగిన సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుంది. చిత్ర నటుడు నాని గారికి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారికి, చిత్ర బృందానికి మంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు” అంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *